Man Dies in Rafting Accident: రిషీకేశ్‌లో రాఫ్టింగ్.. గంగానదిలో పడి యువకుడి దుర్మరణం
ABN , Publish Date - Apr 21 , 2025 | 08:04 AM
రిశీకేశ్‌లో జరిగిన రాఫ్టింగ్ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మణం చెందాడు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనం కలిగిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: రిషీకేశ్‌లో రాఫ్టింగ్ సాహస క్రీడలో పాల్గొనేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ గంగానదిలో పడి దుర్మరణం చెందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తెహ్రీ జిల్లాలోని మునికిరేటీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని సాగర్ నేగీ(28)గా గుర్తించారు.
సాగర్ తన స్నేహితులతో కలిసి గంగా నదిలో రాఫ్టింగ్ (పడవ ప్రయాణం) కోసం వచ్చారు. ప్రత్యేకమైన రాఫ్టింగ్ నావలో ఆరుగురు శివపురి నుంచి బయలుదేరారు. ఇంతలో నదిలో పోటు ఎక్కువవుడంతో నావ భారీ కుదుపులకు లోనైంది. దీంతో, సాగర్ బ్యాలెన్స్ తప్పి నదిలో పడిపోయారు. అతడిని రక్షించేందుకు మిగతా వారు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారు అతడిని సమీపించలేకపోయారు.
ఈలోపే సాగర్ స్పృహ కోల్పోయాడు. ఆ తరువాత అతడికి మిగతావారు కాపాడి నావపైకి తీసుకొచ్చినా ఉపయోగం లేకపోయింది. సీపీఆర్ చేసిన సాగర్ పరిస్థితి క్షణక్షణానికీ దిగజారింది. ఈలోపు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు. రాఫ్టింగ్ సమయంలో నిబంధనలను తూచా తప్పకుండా అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రమాదం తాలూకు భయానక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, నీళ్లల్లో కొట్టుకుపోతున్న సాగర్, నావను సమీపించేందుకు విశ్వప్రయత్నమే చేశాడు. నావలోని వారు కూడా అతడిని సమీపించేందుకు తీవ్రంగా శ్రమించినా నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు బాధితుడు దుర్మరణం చెందాడు. .
ఆధ్యాత్మిక ప్రాముఖ్య కలిగిన రిషీకేశ్.. సాహక్రీడలకు కూడా ప్రసిద్ధి. దేశంలోని నలుమూలల నుంచి అనేక మంది బంజీ జంపింగ్, రివర్ రాఫ్టింగ్ వంటి సాహసక్రీడల్లో పాల్గొనేందుకు వస్తుంటారు
ఇవి కూడా చదవండి:
ఫేక్ డాక్టర్‌తో ఇంట్లో ఆపరేషన్.. మహిళ ప్రాణం పాయే..
Brides Mother: పచ్చి మోసం.. పిల్ల అని చెప్పి తల్లితో పెళ్లి చేశారు..