Brides Mother: పచ్చి మోసం.. పిల్ల అని చెప్పి తల్లితో పెళ్లి చేశారు..
ABN , Publish Date - Apr 20 , 2025 | 08:23 AM
Tricked Into Marrying Brides Mother: ఆ వ్యక్తి పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నందుకు ఎంతో సంతోషించాడు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత వధువు ముసుగు తీసి చూశాడు. అక్కడ ఉన్న వ్యక్తిని చూసి షాక్‌తో పాటు షేక్ కూడా అయ్యాడు.
మీడియాకు సోషల్ మీడియాకు ‘ యాడా దొరకని సరుకు ’ ఒక్క ఉత్తర ప్రదేశ్లోనే దొరుకుతుంది. నేరాల దగ్గరినుంచి వింత వింత ఘటనల వరకు యూపీ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ వింత విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఆ సంఘటన మనకు వింతగా అనిపించినా.. నవ్వు తెప్పించినా.. బాధితుడు మాత్రం చాలా బాధ పడుతున్నాడు. తనకు జరిగిన మోసం ఇంకెవ్వరికీ జరగకూడదని అంటున్నాడు. పోలీసులకు సైతం తనకు జరిగిన దారుణమైన మోసంపై ఫిర్యాదు చేశాడు. ఇంతకీ అతడికి జరిగిన మోసం ఏంటంటే..
పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, మీరట్‌లోని బ్రహ్మపురికి చెందిన 22 ఏళ్ల మహ్మద్ అజీమ్ అనే వ్యక్తికి కొన్ని నెలల క్రితం షామ్లి జిల్లాకు చెందిన మంతాషా అనే యువతితో పెళ్లి నిశ్చయం అయింది. మంతాషా అన్న నదీమ్, వదిన షాయెదా ఆ పెళ్లి కుదిర్చారు. మార్చి 31వ తేదీన పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. పెళ్లి తంతు అయిపోయిన తర్వాత అజీమ్ పరదా తెరిచి భార్యను చూశాడు. అక్కడున్న వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు. మంతాషా ఉండాల్సిన స్థానంలో 45 ఏళ్ల ఆమె తల్లి ఉంది. అక్కడ పిల్ల బదులు పిల్ల తల్లిని చూసి అతడి కళ్లు బైర్లు కమ్మాయి.
ఇదేంటని ప్రశ్నించాడు. దీంతో అసలు కథ మొదలైంది. ఆ మహిళతో కాపురం చేయకపోతే రేప్ కేసు పెడతామంటూ నదీమ్, షాయోదా బెదిరింపులకు దిగారు. కొన్ని రోజుల పాటు వారి వేధింపులు మౌనంగా భరించిన అజీమ్ గురువారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. నదీమ్, మంతాషాలపై ఫిర్యాదు చేశాడు. ‘ పెళ్లి సందర్భంగా 5 లక్షల రూపాయలు చేతులు మారాయి. పిల్లకు బదులు ఆమె తల్లితో నాకు పెళ్లి చేశారు. ఆ మోసాన్ని నేను ప్రశ్నించాను. వాళ్లు నాపై బెదిరింపులకు దిగారు’ అని అన్నాడు. పోలీస్ కేసు నేపథ్యంలో రెండు వర్గాల మధ్య సెటిల్‌మెంట్ జరిగింది. అజీమ్ కేసు విత్ డ్రా చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి
10th Class: టెన్త్ విద్యార్థికి ఎంత కష్టం వచ్చింది.. పరీక్ష పాస్ కాకపోతే బ్రేకప్..
CID 2 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు.. ఆయన బతికే ఉన్నాడు