Share News

Man Chops Wife Into Pieces: భార్యను చంపి.. ముక్కలు చేసి.. ఒక్కో పార్టు 10 కి.మీ దూరంలో పడేసి..

ABN , Publish Date - May 17 , 2025 | 01:49 PM

Man Chops Wife Into Pieces: గత వారం లక్నోకు వెళదామని చెప్పి భార్యను వెంట తీసుకెళ్లాడు. మార్గం మధ్యలో ఆమెను చంపేశాడు. భార్య శవాన్ని ముక్కలు, ముక్కలుగా కోశాడు. కొన్ని శరీర భాగాలను కాల్వలో పడేశాడు.

Man Chops Wife Into Pieces: భార్యను చంపి.. ముక్కలు చేసి.. ఒక్కో పార్టు 10 కి.మీ దూరంలో పడేసి..
Man Chops Wife Into Pieces

నోయిడా: 21వ శతాబ్దంలోనూ అదనపు కట్నాల కోసం కొంతమంది దుర్మార్గులు భార్యలను హింసిస్తున్నారు. తాము అనుకున్నది దక్కకపోతే దారుణాలకు పాల్పడుతున్నారు. హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా, ఓ భర్త అదనపు కట్నం కోసం భార్యను చంపేశాడు. అనంతరం ఆమె శవాన్ని ముక్కలు, ముక్కలుగా కోసి కిలోమీటర్ల దూరంలో పడేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, శ్రావస్తికి చెందిన సైఫుద్దిన్, సబీనా భార్యాభర్తలు.


సైఫుద్దిన్ అదనపు కట్నం తేవాలంటూ భార్యను హింసిస్తూ ఉన్నాడు. రోజు రోజుకు ఆ వేధింపులు పెరిగాయి. భర్త ఎంత ఇబ్బంది పెట్టినా ఆమె మౌనంగా భరించేది. తన తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చేంత స్థోమత లేదని చెప్పేది. అదనపు కట్నం తేకపోవటంతో సైఫుద్ధిన్‌, సబీనాపై పగ పెంచుకున్నాడు. గత వారం లక్నోకు వెళదామని చెప్పి భార్యను వెంట తీసుకెళ్లాడు. మార్గం మధ్యలో ఆమెను చంపేశాడు. భార్య శవాన్ని ముక్కలు, ముక్కలుగా కోశాడు. కొన్ని శరీర భాగాలను కాల్వలో పడేశాడు. మరికొన్ని శరీర భాగాలను 10 కిలోమీటర్ల పరిధిలో అక్కడక్కడా పడేశాడు.


తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు సాయంత్రం సబీనా సోదరుడు ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో అతడు నేరుగా సబీనా ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె లేదు. ఆమె భర్త మాత్రమే ఉన్నాడు. అతడికి అనుమానం వచ్చింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైఫుద్దిన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. సైఫ్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. రెండు రోజులు బాగా విచారించిన తర్వాత అసలు విషయం బయటపెట్టాడు. పోలీసులు సైఫుద్దిన్‌ను అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.


ఇవి కూడా చదవండి

Class 8 Student: రోడ్డుపక్కన పడున్న పసికందును పెంచుకున్న మహిళ.. పెద్దయి తల్లినే చంపిన బాలిక

Bengaluru Techie: చిన్న వయసులోనే కోటి సంపాదన.. సీక్రెట్ చెప్పిన టెకీ..

Updated Date - May 17 , 2025 | 02:01 PM