Man Attacks Friends Funeral Pyre: చితి మంటల్లోని ఫ్రెండ్ శవంపై దాడి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:50 PM
సోము శవాన్ని చితిపై పెట్టి అంటించారు. చితికి కొంత దూరంలో నిలబడి మృతుడి కుటుంబసభ్యులు ఏడుస్తూ ఉన్నారు. ఇంతలో శ్యాము అక్కడికి వచ్చాడు. వెంట తెచ్చుకున్న కర్రతో చితిపై ఉన్న సోము శవాన్ని కొట్టడం మొదలెట్టాడు.
చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన స్నేహితుడు చనిపోతే ఎవ్వరికైనా బాధ ఉంటుంది. ఎంత రాయిలాంటి గుండె కలిగిన మనిషికైనా కన్నీళ్లు వస్తాయి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలోని వ్యక్తి మాత్రం స్నేహితుడు చనిపోతే బాధపడలేదు. పైగా చనిపోయిన ఫ్రెండ్ మీద కోపంతో చితిమంటల్లోని అతడి శవంపై కర్రతో దాడి చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వ్యక్తి ఎందుకలా చేశాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇక, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్‌లోని ఓ మారు మూల గ్రామానికి చెందిన శ్యాము, సోము(పేర్లు మార్చాం) చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. పెరిగి పెద్దయి, పెళ్లిళ్లు అయినా కూడా వారి స్నేహం అలాగే కొనసాగింది. ఇద్దరూ వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం శ్యాము నుంచి సోము 50 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. పంట అమ్మిన వెంటనే డబ్బులు తిరిగి ఇస్తానన్నాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు సోము అనారోగ్యం పాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిరోజుల క్రితం చనిపోయాడు.
కుటుంబసభ్యులు ఊరి బయట ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. శవాన్ని చితిపై పెట్టి అంటించారు. చితికి కొంత దూరంలో నిలబడి మృతుడి కుటుంబసభ్యులు ఏడుస్తూ ఉన్నారు. ఇంతలో శ్యాము అక్కడికి వచ్చాడు. వెంట తెచ్చుకున్న కర్రతో చితిపై ఉన్న సోము శవాన్ని కొట్టడం మొదలెట్టాడు. తన కోపం చల్లారేవరకు బాగా కొట్టాడు. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీన్నంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు. వాట్సాప్‌లో షేర్ చేశాడు. అది కాస్తా ఇన్‌స్టా, ఎక్స్‌తో పాటు మిగిలిన సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
రైలు ఎక్కి ఆధార్ చూపించిన వృద్ధురాలు.. అందరూ షాక్..
యువతుల్ని నమ్మించి తీసుకెళ్లి.. ఇన్‌స్టా లైవ్‌లో చిత్ర హింసలు పెట్టి..