Share News

Dowry Demand: కట్నం తిరిగి ఇవ్వమన్నందుకు కొట్టి చంపేశారు

ABN , Publish Date - Dec 30 , 2025 | 05:52 PM

ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అక్కతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి సందర్భంగా ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వమని భార్య అడిగినందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు.

Dowry Demand: కట్నం తిరిగి ఇవ్వమన్నందుకు కొట్టి చంపేశారు
Dowry Demand

భార్యాభర్తల బంధం అంటే ఎక్కువ శాతం బంధాల్లో ఓ అవసరంగా మాత్రమే మిగిలిపోతోంది. చిన్న చిన్న కారణాలతో ప్రతీ రోజూ గొడవలు పడి కొట్టుకుంటున్న భార్యాభర్తలు ఎంతో మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా డబ్బు విషయంలో భార్యాభర్తలు బద్ధ శత్రువుల్లా తయారు అవుతున్నారు. తాజాగా, ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అక్కతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి సందర్భంగా ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వమని భార్య అడిగినందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మహారాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే..


పాల్‌ఘర్‌‌కు చెందిన మహేష్, కల్పన సోనీలకు 2015లో పెళ్లయింది. భార్యాభర్తలు ప్రస్తుతం విరార్‌లో ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల కూతురు ఉంది. పెళ్లయిన కొంతకాలం ఇద్దరి మధ్యా కాపురం సజావుగానే సాగింది. తర్వాత గొడవలు మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలకు కూడా భార్యాభర్తలు గొడవలు పడేవారు. శనివారం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ సందర్భంగా ‘నేను ఈ ఇంట్లో ఉండను. తీసుకున్న కట్నం తిరిగి ఇచ్చేస్తే వెళ్లిపోతాను’ అని కల్పన అంది. దీంతో మహేష్ అతడి సోదరి దీపాళీ ఆగ్రహానికి గురయ్యారు.


పదునైన ఆయుధాలతో ఆమె తలపై విచక్షణా రహితంగా దాడి చేశారు. కల్పన అరుపులు విన్న పొరిగింటి వాళ్లు వెంటనే అక్కడికి వెళ్లారు. గొడవ ఆపి తీవ్రంగా గాయపడ్డ కల్పనను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. సమచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నిందితులు పోలీసులను తప్పుదోవపట్టించడానికి అబద్ధం చెప్పారు. కల్పన బాత్‌రూములో కిందపడ్డం వల్ల గాయపడి చనిపోయిందని అన్నారు. అయితే, డాక్టర్లు మాత్రం ఆమె భారీ దెబ్బల కారణంగా చనిపోయినట్లు తేల్చి చెప్పారు. మర్డర్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి

గిల్ టీ20 జట్టులోకి త్వరలోనే వస్తాడు: భజ్జీ

దుశ్శాసనుడు వచ్చారు.. అమిత్‌షాపై విరుచుకుపడిన మమత

Updated Date - Dec 30 , 2025 | 06:06 PM