Maharashtra SC Certificate News: మహారాష్ట్రలో క్రైస్తవుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:15 AM
హిందు, బౌద్ధ, సిక్కు మతాలవారు కాకుండా ఇతరులు ఎస్సీ ధ్రువపత్రాలను పొంది ఉంటే వాటన్నింటినీ రద్దు చేస్తామని ..
హిందు, బౌద్ద, సిక్కు మతాల వారికే పరిమితం: ఫడణవీస్
ముంబై, జూలై 18: హిందు, బౌద్ధ, సిక్కు మతాలవారు కాకుండా ఇతరులు ఎస్సీ ధ్రువపత్రాలను పొంది ఉంటే వాటన్నింటినీ రద్దు చేస్తామని మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ శుక్రవారం ప్రకటించారు. ఇతర మతాల వారు తప్పుడు మార్గాల్లో ఎస్సీ సర్టిఫికెట్లను సమర్పించి, ఉద్యోగాలు పొంది ఉంటే అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాంటివారు ఎలక్షన్లలో విజయం సాధించి ఉంటే ఆ ఎన్నికను రద్దు చేయిస్తామని చెప్పారు. శాసన మండలిలో బీజేపీ సభ్యుడు అమిత్ గోర్ఖే ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై సమాధానం ఇస్తూ సీఎం ఈ విషయాలను వెల్లడించారు. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల వారికే ఎస్సీ సర్టిఫికెట్లు వర్తిస్తాయని చెప్పారు. తప్పుడు సర్టిఫికెట్‌తో ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను పొందితే ఆ సొమ్మును వసూలు చేస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి