Maha Kumbh Mela: మహా కుంభమేళాకు తగ్గని భక్తుల రద్దీ
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:37 AM
ఆదివారం ఒక్క రోజే సాయంత్రం 6 గంటల వరకు కోటి 36లక్షల మంది ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

ఆదివారం ఒక్క రోజే 1.36 కోట్ల మంది హాజరు
ప్రయాగ్‌రాజ్, ఫిబ్రవరి 16: మహా కుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రధాన రోజులు మౌనీ అమావాస్య, మాఘ పూర్ణిమ, వసంత పంచమి వంటి పర్వదినాలు ముగిసినా భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. ఆదివారం ఒక్క రోజే సాయంత్రం 6 గంటల వరకు కోటి 36లక్షల మంది ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 52.83 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచారించారని వెల్లడించింది. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తులందరూ సహకరించాలని, వారి వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయాలని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సూచించారు. కాగా, శనివారం కూడా 1.36 కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పుణ్య స్నానాలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News