Share News

Luxury Lifestyle: విదేశీ పర్యటనలు..విలాస జీవితం

ABN , Publish Date - May 20 , 2025 | 05:25 AM

గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా ఖరీదైన జీవనశైలితోపాటు పాక్‌ పర్యటనల నేపథ్యంలో అనుమానాస్పదంగా మారింది. ఆమె పహల్గాంలో పర్యటించిన కొద్దికాలానికే అక్కడ ఉగ్రదాడి జరగడం, పాక్‌ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

 Luxury Lifestyle: విదేశీ పర్యటనలు..విలాస జీవితం

ఎక్కడికి వెళ్లినా ఖరీదైన హోటళ్లలోనే బస

ఇదీ యూట్యూబర్‌ జ్యోతీమల్హోత్రా జీవన శైలి

ఈ ఏడాది జనవరిలో పహల్గాంలో పర్యటన

వీడియోలు తీసి పాక్‌ ఏజెంట్లకు చేరవేత?

ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్‌ ఎంబసీకి కేక్‌

తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి ఫొటో

చండీగఢ్‌, మే 19: గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరిన్ని సంచలన వివరాలు వెల్లడయ్యాయి. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆమె ఖరీదైన జీవన శైలి సాగిస్తోంది. ఆమె ఆదాయానికి, విలాస జీవితానికి ఎక్కడా పొంతన లేదు. విమానాల్లో ఎప్పుడూ మొదటి తరగతిలోనే ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఖరీదైన హోటళ్లలో బస చేస్తూ ఖరీదైన రెస్టారెంట్లలోనే భోజనం చేసేది. ఆమె పాక్‌ పర్యటన ఖర్చంతా స్పాన్సర్లదే అని భావిస్తున్నారు. అంతేగాక పాక్‌ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆమె చైనా ర్యటనకు వెళ్లింది. అక్కడ కూడా లగ్జరీ కార్లలో ప్రయాణించింది. అత్యంత ఖరీదైన నగల షాపులకు వెళ్లింది. ఈమె ఈ ఏడాది జనవరిలో కశ్మీర్‌లోని పహల్గాం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మూడు నెలలకే అక్కడ ఉగ్రదాడి జరిగింది. ఐదు రోజుల కశ్మీర్‌ పర్యటనలో భాగంగా ఆమె పహల్గాం వెళ్లింది.

ghyl.jpg

అక్కడ వీడియోలు తీసింది. వీటిని పాక్‌ ఏజెంట్లకు చేరవేసిందా? ఉగ్రదాడికి, ఈమె పర్యటనకు సంబంధం ఉందా...? అనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను నిలిపివేశారు. తాము స్వాధీనం చేసుకున్నాక ఆమె సెల్‌ఫోన్‌, ల్యాప్‌ట్యా్‌పలకు అనుమానాస్పద అంశాలు వచ్చాయని తెలిపారు.


ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలోనూ ఆమె ఢిల్లీలోని పాక్‌ ఎంబసీ అధికారి డాని్‌షతో టచ్‌లోనే ఉందని గుర్తించారు. అతడితో ఆమె చాలా సన్నిహితమైనట్లు భావిస్తున్నారు. కాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు రోజులకు అంటే ఏప్రిల్‌ 24న ఢిల్లీలోని పాక్‌ ఎంబసీకి గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి కేక్‌ తీసుకువచ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో పలువురు విలేకరులు అతడిని ఎందుకు వచ్చావు...? ఏం వేడుకకు కేక్‌ తెస్తున్నావని ప్రశ్నించారు..? అయితే అతడు వారికి సమాధానం చెప్పకుండా త్వర త్వరగా లోపలికి వెళ్లిపోయాడు. ఈ గడ్డపు వ్యక్తితో జ్యోతి మల్హోత్రా దిగిన ఫొటో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్‌ పర్యటనలో జ్యోతి హాజరైన ఒక పార్టీ(వేడుక) వీడియోలోనూ ఈ గడ్డపు వ్యక్తి కనిపించాడు. అతడిని ఆమె కలుసుకొన్నట్లు వీడియోలో కనిపిస్తుంది. కాగా పలువురు ఇతర సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో జ్యోతికి సంబంధాలు ఉన్నాయని, వారికీ పాకిస్థాన్‌ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని హిస్సార్‌ ఎస్పీ శశాంక్‌ కుమార్‌ సావన్‌ తెలిపారు. పాక్‌ ఏజెంట్లు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను నియమించుకుని తమ వాదనను ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 05:25 AM