Share News

LPG Rates: వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

ABN , Publish Date - May 02 , 2025 | 04:11 AM

వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.14.50 తగ్గించి రూ.1,741గా నిర్ణయించారు. అలాగే ఏటీఎఫ్‌ ధర కిలో లీటర్‌కు రూ.3,954.38 తగ్గించి రూ.85,486.80గా స్థిరపరిచారు.

LPG Rates: వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

న్యూఢిల్లీ, మే 1: వాణిజ్య అవసరాలకు వినియోగించే 19.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ రంగ ముడి చమురు సంస్థలు తగ్గించాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే వాణిజ్య సిలిండర్‌ ధర రూ.14.50 తగ్గిస్తూ గురువారం నోటిఫికేషన్‌ జారీచేశాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో వంటగ్యాస్‌ సిలిండర్‌ రూ.1,741లకు లభిస్తుంది. ఏప్రిల్‌ ఒకటో తేదీన రూ.41 తగ్గించిన తర్వాత మళ్లీ వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గించడం ఇదే ప్రథమం. ఇక విమానాల్లో వినియోగించే ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యుయల్‌ (ఏటీఎఫ్‌) కిలో లీటర్‌పై 4.4ు అంటే రూ.3,954.38 ధర తగ్గించాయి. దీంతో ఢిల్లీలో ఏటీఎఫ్‌ కిలో లీటర్‌ పెట్రోల్‌ రూ.85,486.80లకు లభిస్తుంది. గత నెల ఒకటో తేదీన ఏటీఎఫ్‌ కిలో లీటర్‌ ధర రూ.5,870.54 (6.15శాతం) తగ్గించాయి.


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 04:11 AM