Families Clash Violently: రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ప్రేమ వివాహం.. రెండేళ్ల తర్వాత..
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:08 PM
ప్రేమ వివాహం జరిగిన రెండున్నరేళ్ల తర్వాత అనుకోని సంఘటన చోటుచేసుకుంది. అమ్మాయి కుటుంబసభ్యులు అబ్బాయి తమ్ముడి ముక్కు కోసిపారేశారు. ఇది తెలిసిన అబ్బాయి కుటుంబసభ్యులు అమ్మాయి చిన్నాన్న కాళ్లు నరికేశారు.
ప్రేమ వివాహం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రేమ వివాహం జరిగిన రెండున్నరేళ్ల తర్వాత అనుకోని సంఘటన చోటుచేసుకుంది. అమ్మాయి కుటుంబసభ్యులు అబ్బాయి తమ్ముడి ముక్కు కోసిపారేశారు. ఇది తెలిసిన అబ్బాయి కుటుంబసభ్యులు అమ్మాయి చిన్నాన్న కాళ్లు నరికేశారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో బుధవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బర్మర్‌కు చెందిన శ్రవణ్ సింగ్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి అమ్మాయి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ప్రేమికులిద్దరూ ఇంటినుంచి పారి పోయి పెళ్లి చేసుకున్నారు.
రెండున్నరేళ్ల క్రితం ఈ పెళ్లి జరిగింది. పెళ్లి ఇష్టం లేని అమ్మాయి కుటుంబసభ్యులు అబ్బాయి కుటుంబంపై పగ పెంచుకున్నారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సరైన అవకాశం లభించింది. శ్రవణ్ సింగ్ సోదరుడు యూకే సింగ్ కత్తి తీసుకుని పొలం పనులకు వెళ్లాడు. అమ్మాయి చిన్నాన్న ధరమ్ సింగ్ తన సహచరులతో కలిసి అతడిపై దాడి చేశాడు. దాడి సమయంలో పెనుగులాట చోటుచేసుకుంది. కత్తి కారణంగా యూకే సింగ్ ముక్కు తెగిపోయింది. దీంతో భయపడిపోయిన ధరమ్ సింగ్, అతడి సహచరులు అక్కడినుంచి పారిపోయారు. స్థానికులు గాయపడ్డ యూకే సింగ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
యూకే సింగ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. యూకే సింగ్‌పై దాడి జరిగిందని తెలిసిన అతడి కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంటికి వెళుతున్న సమయంలో ధరమ్ సింగ్‌పై దాడి చేశారు. కాళ్లు నరికేశారు. చేతులకు కూడా తీవ్రగాయాలు అయ్యాయి. ధరమ్ సింగ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడులతో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. అబ్బాయి తరఫు నుంచి నారాయణ్ సింగ్, ఆలమ్ సింగ్, జలమ్ సింగ్‌లు అరెస్ట్ కాగా.. అమ్మాయి తరఫున నుంచి శంకర్ సింగ్, సైతాన్ సింగ్, తాన్ సింగ్, సుమీర్ సింగ్‌లు అరెస్ట్ అయ్యారు.
ఇవి కూడా చదవండి
గవర్నర్ రవి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ దూకుడు