Share News

Love Affair: యువకుడితో ప్రేమ.. చెల్లెలికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవటంతో..

ABN , Publish Date - May 30 , 2025 | 09:13 PM

Love Affair: తమ ప్రేమ వ్యవహారం బయటపడటంతో సుజాత, సచిన్ భయపడిపోయారు. విడిపోతామన్న భయంతో ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Love Affair: యువకుడితో ప్రేమ.. చెల్లెలికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవటంతో..
Love Affair

పెళ్లి తర్వాత ప్రేమ వ్యవహారాలు చాలా వరకు విషాదాలుగా ముగుస్తున్నాయి. తమ ప్రేమ వ్యవహారం బయటపడిందని.. ఇకపై కలిసి బతకలేమన్న భయంతో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వివాహిత, ఆమె ప్రియుడు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన కర్ణాటకలోని శివమొగ్గలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శివమొగ్గకు చెందిన 33 ఏళ్ల సుజాతకు 14 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. నాలుగేళ్ల క్రితం ఆమె భర్త ఇంటినుంచి వెళ్లిపోయాడు. మళ్లీ తిరిగి రాలేదు.


ఆమె తన పిల్లలతో కలిసి తమ్మడిహళ్లికొప్పలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడే ఉంటోంది. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు టైలరింగ్ చేసే సచిన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని గత కొంతకాలంనుంచి అక్కడే కలిసి ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఇద్దరూ కలిసి ఇంట్లో ఉండగా.. సుజాత చెల్లెలు ఇంటికి వచ్చింది. ఇద్దర్నీ ఒకే చోట చూసి ఆగ్రహానికి గురైంది. వారితో గొడవపెట్టుకుంది. కొద్దిసేపటి తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయింది.


తమ ప్రేమ వ్యవహారం బయటపడటంతో సుజాత, సచిన్ భయపడిపోయారు. విడిపోతామన్న భయంతో ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిని గుర్తించిన పొరిగింటి వారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్ప్రతిలో చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సచిన్ బలవంతం చేయటంతోటే తమ కూతురు పురుగుల మందు తాగిందని సుజాత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

స్టేజిపై ప్రధాని మోదీ పేరు మర్చిపోయిన సీఎం.. ఏమన్నాడంటే..

96 సీక్వెల్‌.. క్యారెక్టర్లపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

Updated Date - May 30 , 2025 | 09:13 PM