Congress: సభాపతిని సాగనంపుదాం.. హొరట్టిపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ కసరత్తు
ABN , Publish Date - Jan 18 , 2025 | 01:55 PM
విధానపరిషత్ సభాపతి బసవరాజ హొరట్టి(Speaker Basavaraja Horatti)పై వేటు వేయాలని అధికార కాంగ్రెస్ తీవ్రంగా కసరత్తు ప్రారంభించింది. బెళగావి శాసనసభ శీతాకాల సమావేశాల వేళ చివరిరోజున మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్, బీజేపీ సభ్యుడు సీటీ రవిల మధ్య తలెత్తిన వివాదంలో సభాపతి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి.

బెంగళూరు: విధానపరిషత్ సభాపతి బసవరాజ హొరట్టి(Speaker Basavaraja Horatti)పై వేటు వేయాలని అధికార కాంగ్రెస్ తీవ్రంగా కసరత్తు ప్రారంభించింది. బెళగావి శాసనసభ శీతాకాల సమావేశాల వేళ చివరిరోజున మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్, బీజేపీ సభ్యుడు సీటీ రవిల మధ్య తలెత్తిన వివాదంలో సభాపతి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్(Minister Lakshmi Hebbalkar) పట్ల ఎమ్మెల్సీ సీటీ రవి అనుచితమైన వ్యాఖ్యలు చేశారని పోరెన్సిక్‌లో రుజువైనట్టు ప్రచారం సాగుతోంది. అయితే సభాపతి మాత్రం అటువంటి వ్యాఖ్యలు రికార్డు కాలేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తను కూడా చదవండి: Onions: కోయకుండానే కన్నీళ్లు వస్తున్నాయి.. ఉల్లి ధరలకు రెక్కలు.. కిలో ఎంతంటే..
ఆ తర్వాత సీఐడీ విచారణకు సభాపతి అనుమతులు ఇవ్వలేదు. ఈ కారణాలతోనే సభాపతిపై అవిశ్వాసం పెట్టాలని కాంగ్రెస్ వర్గాలు తీవ్రంగా ఆలోచన చేస్తున్నాయి. సుదీర్ఘకాలంలో జేడీఎస్‌లో కొనసాగిన హొరట్టి ఇటీవలి ఎన్నికల్లో బీజేపీలో చేరి సభాపతి అయ్యారు. ఆయన పరిషత్‌లో సీనియర్ సభ్యుడిగా ప్రత్యేకంగా గౌరవిస్తారు. కానీ బెళగావిలో వివాదం పట్ల ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. పరిషత్‌లో మొత్తం సభ్యులు 75మంది. 38మంది సభ్యుల మద్దతు ఉండేవారికి సభాపతి అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి 33మంది ఉండగా, బీజేపీ నుంచి 29మంది జేడీఎస్ 8మంది ఉన్నారు. ఒకరు ఇండిపెండెంట్ సభ్యుడు కాగా సభాపతి ఒకరు. మూడుస్థానాలు ఖాళీగా ఉన్నాయి. సభాపతితో కలిపితే బీజేపీ-జేడీఎస్(BJP-JDS) కూటమికి 38మంది మద్దతు ఉంది.
ఇండిపెండెంట్‌గా ఉండే లఖన్ జార్కిహొళి బీజేపీకి మద్దతు ఇస్తే ఎటువంటి ఢోకా ఉండదు. అయితే జేడీఎస్ సభ్యుడు తిప్పేస్వామి పదవీకాలం ఈనెల 27తో ముగియనుంది. ప్రస్తుతం ఖాళీగా ఉండే మూడుస్థానాలు కలిపి ఒకేసారి 4 స్థానాలకు ప్రభుత్వం నామినేట్ చేసుకుంటే కాంగ్రెస్ బలం 37కు పెరుగుతుంది. అప్పుడు ఇండిపెండెంట్ మద్దతు కూడా పొందితే 38మంది మద్దతుతో సభాపతిని మార్చే అవకాశం ఉంది.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?
ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు
ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ
ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్‌గా తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
Read Latest Telangana News and National News