Share News

Leopard: మరో చిరుత సంచారం..

ABN , Publish Date - Sep 30 , 2025 | 01:02 PM

రాయచూరు తాలూకాలోని డొంగరాంపూర్‌ గుట్ట పై సోమవారం మరో సారి చిరుత సంచారం కనిపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డొంగరాంపూర్‌ మామిడిదొడ్డి మద్యగల పొలంలో కుక్కపై దాడి చేసి చంపి వేయడంతో చిరుత సంచరిస్తున్న విషయం బయటికి పొక్కింది.

Leopard: మరో చిరుత సంచారం..

- కుక్కపై దాడితో గ్రామంలో ఆందోళన

రాయచూరు(బెంగళూరు): రాయచూరు(Rayacgur) తాలూకాలోని డొంగరాంపూర్‌ గుట్ట పై సోమవారం మరో సారి చిరుత(Leopard ) సంచారం కనిపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డొంగరాంపూర్‌ మామిడిదొడ్డి మద్యగల పొలంలో కుక్కపై దాడి చేసి చంపి వేయడంతో చిరుత సంచరిస్తున్న విషయం బయటికి పొక్కింది. చిరుత సంచరించిన జాడలు అక్కడ కనిపించడంతో గ్రామస్థులు పొలాలకు వెళ్లాలంటే ఆందోళన చెందుతున్నారు.


pandu2.2.jpg

మూడు నెలల క్రితం డొంగరాంపూర్‌ పరమేశ్వర గుట్ట పై చిరుత ఒకటి నెమలి కుక్కల పై దాడి చేసి చంపివేయగా అటవి శాఖ అధికారులు బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించారు. తిరిగి మూడు నెలల అనంతరం చిరుత సంచారం కలకలం రేపుతోంది.


pandu2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నైరుతిలో సాధారణ వర్షపాతమే

Read Latest Telangana News and National News

Updated Date - Sep 30 , 2025 | 01:02 PM