Gold Smuggling: యూట్యూబ్ చూసి స్మగ్లింగ్ .. సూర్య సినిమాను దింపేసింది..
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:13 PM
వీడొక్కడే సినిమాలో హీరో సూర్య ఆఫ్రికా నుంచి వజ్రాలు స్మగ్లింగ్ చేస్తాడు. చెన్నై ఎయిర్ పోర్టు అధికారులకు దొరకకుండా ఉండడానికి వజ్రాలను ఓ బాటిల్‌కు అతికిస్తాడు. ఈ పనంతా ఎయిర్‌పోర్టు రెస్ట్ రూములో కూర్చుని చేస్తాడు. అచ్చం సూర్య చేసినట్లుగానే రన్యా రావు కూడా చేసింది. బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి దుబాయ్ ఎయిర్ పోర్టు రెస్ట్ రూమును వాడుకుంది. రెస్ట్ రూములోనే..

కన్నడ హీరోయిన్ రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ప్రస్తుతం ఆమె డీఆర్ఐ కస్టడీలో ఉంది. విచారణ సందర్భంగా రన్యా విస్తు పోయే విషయాలను బయటపెట్టింది. తాను దుబాయ్ నుంచి మొదటి సారి బంగారాన్ని స్మగ్లింగ్ చేశానని చెప్పుకొచ్చింది. ఇంతకు ముందు ఎప్పుడూ తాను దుబాయ్ నుంచి బెంగళూరుకు బంగారం స్మగ్లింగ్ చేయలేదని తెలిపింది. యూట్యూబ్ చూసి బంగారం ఎలా స్మగ్లింగ్ చేయాలో నేర్చుకున్నానని అంది.
ఫారెన్ నెంబర్ నుంచి ఫోన్లు..
డీఆర్ఐ విచారణలో రన్యారావు మాట్లాడుతూ.. 'మార్చి 1వ తేదీన నాకు గుర్తు తెలియని ఫారెన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అంతకు రెండు వారాల ముందు నుంచి నాకు గుర్తు తెలియని ఫారెన్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. నన్ను దుబాయ్ ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 3 వద్ద ఉన్న గేట్ దగ్గరకు వెళ్లమని చెప్పారు. అక్కడ బంగారాన్ని తీసుకుని దుబాయ్ నుంచి బెంగళూరులో డెలివరీ ఇవ్వమని అన్నారు. ఆ బంగారం మొత్తం ప్లాస్టిక్ పాకెట్స్ లో ఉంది. వాటిని నేను నా శరీరానికి అతికించుకున్నాను. దుస్తులు, బూట్లలోనూ కొంత బంగారాన్ని దాచాను' అని చెప్పింది.
అచ్చం సూర్య సినిమాలోలాగా..
వీడొక్కడే సినిమాలో హీరో సూర్య ఆఫ్రికా నుంచి వజ్రాలు స్మగ్లింగ్ చేస్తాడు. చెన్నై ఎయిర్ పోర్టు అధికారులకు దొరకకుండా ఉండడానికి వజ్రాలను ఓ బాటిల్‌కు అతికిస్తాడు. ఈ పనంతా ఎయిర్‌పోర్టు రెస్ట్ రూములో కూర్చుని చేస్తాడు. అచ్చం సూర్య చేసినట్లుగానే రన్యా రావు కూడా చేసింది. బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి దుబాయ్ ఎయిర్ పోర్టు రెస్ట్ రూమును వాడుకుంది. రెస్ట్ రూములోనే బంగారాన్ని తన శరీరానికి అతికించుకుంది. ఎంత పక్కాగా ప్లాన్ చేసినా కూడా కస్టమ్స్ అధికారులకు దొరికి పోయింది.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..