Share News

CJI Gavai Attack: చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడి.. లాయర్ సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:44 PM

చీఫ్ జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. ‘పొండి.. వెళ్లి ఆ దేవుడ్నే అడగండి. ఏదో ఒకటి చేయమనండి’ అని అన్నారు. చీఫ్ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలతో రాజేశ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కోపంలో తన షూ తీసి చీఫ్ జస్టిస్ గవాయ్‌పై విసిరారు.

CJI Gavai Attack: చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడి.. లాయర్ సంచలన వ్యాఖ్యలు..
CJI Gavai Attack

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి‌పై ఓ లాయర్ షూతో దాడి చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఈ దారుణం చోటుచేసుకుంది. 71 ఏళ్ల రాజేశ్ కిశోర్ చీఫ్ జస్టిస్ గవాయ్‌పై షూతో దాడికి పాల్పడ్డారు. సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా చీఫ్ జస్టిస్ గవాయ్ మాట్లాడారన్న కోపంతో ఈ దాడికి పాల్పడినట్లు రాజేశ్ స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.


‘నేను ఏమీ చేయలేదు. అంతా ఆ దేవుడే చేశాడు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడారు. ఆయన రియాక్షన్‌కు ఇది యాక్షన్. ఆ దేవుడి ఆదేశం’ అని అన్నారు.

ఈ గొడవకు కారణం ఏంటంటే.. కొద్దిరోజుల క్రితం కజురహోలో ఏడు అడుగుల మహా విష్ణువు విగ్రహం తల ధ్వంసం అయింది. ఈ నేపథ్యంలోనే ఆ ఘటనపై సుప్రీంకోర్టులో ఓ పిల్ దాఖలైంది. సోమవారం ఆ పిల్‌పై చీఫ్ జస్టిస్ గవాయ్ విచారణ జరిపారు.


ధ్వంసమైన మహా విష్ణువు విగ్రహం నిర్మాణం విషయంలో న్యాయ స్థానం కలుగజేసుకోదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే చీఫ్ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలతో రాజేశ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కోపంలో తన షూ తీసి చీఫ్ జస్టిస్ గవాయ్‌పై విసరబోయారు. కాగా, చీఫ్ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఆయనపై మండిపడుతున్నారు. దీనిపై గవాయ్ స్పందిస్తూ.. ‘నన్ను సోషల్ మీడియాలో తప్పుగా చిత్రీకరిస్తున్నారు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

ఖమ్మం అభివృద్ధే నా లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

గుంతలో ఇరుక్కున్న కారు! భారీ ట్రాఫిక్ జామ్!!

Updated Date - Oct 07 , 2025 | 01:17 PM