Share News

Sikkim: సైనిక శిబిరంపై పడ్డ కొండచరియలు

ABN , Publish Date - Jun 03 , 2025 | 05:35 AM

సిక్కింలోని ఛటేన్ సైనిక శిబిరంపై కొండచరియలు పడిన ఘటనలో ముగ్గురు సిబ్బంది మృతి చెందగా ఆరుగురు గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం సంభవించింది, గల్లంతైన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నారు.

Sikkim: సైనిక శిబిరంపై పడ్డ కొండచరియలు

ముగ్గురి మృతి.. ఆరుగురి గల్లంతు

గ్యాంగ్‌టక్‌, జూన్‌ 2: సిక్కింలోని ఛటేన్‌లో సైనిక శిబిరంపై కొండచరియలు విరిగిపడడంతో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతిచెందగా, ఆరుగురి జాడ గల్లంతయింది. ఆదివారం రాత్రి 7గంటల సమయంలో భారీ వర్షం పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన సిబ్బంది లఖ్విందర్‌ సింగ్‌, లాన్స్‌ నాయక్‌ మునీశ్‌ ఠాకూర్‌, అభిషేక్‌ లఖాడ మృతదేహాలను వెలికి తీశామని ఆయన వెల్లడించారు. మరో నలుగురు సైనికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెప్పారు. గల్లంతైన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయన్నారు.


ఇవీ చదవండి:

కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్

పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 05:35 AM