Share News

Kishan Reddy: నా రాజకీయ జీవితం అలా మొదలైంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - May 09 , 2025 | 01:47 PM

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండారు దత్తాత్రేయకీ తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.

Kishan Reddy: నా రాజకీయ జీవితం అలా మొదలైంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Kishan Reddy

ఢిల్లీ: కుల, మతాలకు అతీతంగా అందరూ దత్తాత్రేయను అభిమానిస్తారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా బండారు దత్తాత్రేయకీ తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఆర్ ఎస్ ఎస్ లో మొదటి నుంచి దత్తాత్రేయ పని చేశారన్నారు. మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజపేయి నేతృత్వంలో కేంద్రమంత్రిగా బండారు దత్తాత్రేయ పని చేశారని.. తన రాజకీయ జీవితం దత్తాత్రేయ గారి చేతుల మీదగానే ప్రారంభం అయిందని తెలిపారు. దత్తాత్రేయ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి తాను ఇప్పుడు ఎంపీగా ఉన్నట్లు తెలిపారు. ఎంతోమంది కార్యకర్తలకు బండారు దత్తాత్రేయ స్ఫూర్తి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు.


బీజేపీలో అత్యంత సీనియర్‌ నాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి ప్రస్తుత హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ. ఆయన రచించిన ‘జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ’ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆవిష్కరించారు. 1947 జూన్‌ 12న జన్మించిన బండారు దత్తాత్రేయ తన జీవితంలోని అత్యంత కీలక ఘట్టాలను ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వివరించారు. ఐదో ఏటే తండ్రిని కోల్పోయిన దత్తాత్రేయ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయకుండా గ్రాడ్యుయేషన్‌ వరకు చదివారు. దత్తాత్రేయ పదో తరగతి చదువుతున్న సమయంలోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు.దాంతో దత్తాత్రేయ జీవితమే మారిపోయింది. 1980లో బీజేపీ ఏర్పడిన తర్వాత ఏపీలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కావడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ లోని‌ అధినేతలందరూ దత్తాత్రేయను బాగా అభిమానించారు. పలు సేవ కార్యక్రమాలు చేపట్టి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్వాతంత్య్ర అనంతర దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అనేక ఘట్టాలను దత్తాత్రేయ తన ఆత్మకథలో బాగా వివరించారు.


Also Read:

Operation Sindoor: ఢిల్లీ ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Operation Sindoor: మోదీ హయాంలో వాయుసేన రక్షణ, దాడి సామార్ధ్యాల బలోపేతం..

Operation Sindoor: సైరన్ మోగిందా.. వెంటనే ఇలా చేస్తే మీరు సేఫ్..

Updated Date - May 09 , 2025 | 02:18 PM