National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రె్‌సను భయపెట్టడానికే
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:55 AM
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లపై కేంద్రం ఆరోపణలు మోదీ ప్రభుత్వం కూటప్రచారం భాగమేనని ఖర్గే విమర్శించారు. ఈ కేసులో ఏదీ రుజువుకాకపోయినా, బీజేపీ అబద్ధాలను ప్రజల్లో ఎండగట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రెస్ మీట్లు నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది.
బిహార్ బహిరంగ సభలో ఖర్గే
బక్సర్, ఏప్రిల్ 20: కాంగ్రెస్ పార్టీని భయపెట్టేందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను చేర్చిందని ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఆరోపించారు. బిహార్‌లోని బక్సర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ తాము ఎవ్వరికీ భయపడబోమన్నారు. ఈ కేసులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు సోదాలు చేపట్టాయని, వారికి ఏమీ దొరకలేదని చెప్పారు. బిహార్‌లో అధికారం కోసం సీఎం నితీశ్ పార్టీలు మారుతుంటారని ఖర్గే ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ బిహార్‌కు ఇస్తామన్న 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ సంగతి ఏమైందని ఖర్గే ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ అబద్ధాలను వెల్లడించేందుకు ఈ నెల 21 నుంచి 24 వరకు 57 నగరాల్లో కాంగ్రెస్ నేతలు ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహిస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్
Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Read More Business News and Latest Telugu News