Kerala Congress : బీడీలు బిహార్ పోస్ట్ వివాదంతో
ABN , Publish Date - Sep 07 , 2025 | 05:57 AM
బీడీలు-బిహార్ అంటూ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) సోషల్ మీడియా, డిజిటల్ సెల్ చీఫ్ వీటీ బలరాం...
కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా చీఫ్ రాజీనామా
న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: బీడీలు-బిహార్ అంటూ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) సోషల్ మీడియా, డిజిటల్ సెల్ చీఫ్ వీటీ బలరాం రాజీనామా చేశారు. జీఎస్టీ పన్నుల్లో మార్పులను ఉద్దేశించి కేపీసీసీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో బిహార్‌ను బీడీలతో ముడిపెట్టి ఈ పోస్ట్ పెట్టారు. బీడీల మీద పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ, అదే సమయంలో సిగరెట్లపై పన్నును పెంచుతూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. దీన్ని ఉద్దేశించి.. ‘‘బీడీలు, బిహార్.. బితో మొదలవుతాయి.. ఇక బీడీలు తాగడం తప్పు కాదు..’’ అని ఆ పోస్ట్ పెట్టిన గంటల్లోనే రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. బిహార్ అధికార ఎన్డీయే పక్ష నేతలు ఇది బిహార్‌ను అవమానించడమేనని ఆరోపించారు. విమర్శల నేపథ్యంలో కేపీసీసీ ఆ పోస్ట్‌ను తొలగించి క్షమాపణలు తెలియజేసింది.
ఇవి కూడా చదవండి..
తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం
అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్
For More National News And Telugu News