Share News

Kejriwal: ఆయన.. అమిత్‌ షా గూండా!

ABN , Publish Date - Feb 05 , 2025 | 05:13 AM

‘‘అమిత్‌షా గూండా ఒకరు పోలీసు దుస్తులు ధరించారు. బహిరంగంగానే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అమిత్‌షా గారూ.. ఈ దేశం మీ గూండాయిజాన్ని ఏమాత్రం సహించదు’’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Kejriwal: ఆయన.. అమిత్‌ షా గూండా!

ఢిల్లీ పోలీసుపై కేజ్రీవాల్‌ తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఢిల్లీ పోలీసు అధికారిపై ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా గుండాగా అభివర్ణించారు. ‘‘అమిత్‌షా గూండా ఒకరు పోలీసు దుస్తులు ధరించారు. బహిరంగంగానే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అమిత్‌షా గారూ.. ఈ దేశం మీ గూండాయిజాన్ని ఏమాత్రం సహించదు’’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. సంబంధిత వీడియోను ఆప్‌ మీడియా చీఫ్‌ కోఆర్డినేటర్‌ వికాస్‌ యోగి సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘‘నాతో పెట్టుకుంటే నువ్వు నన్నేమీ చేయలేవు. కానీ, నేను తలుచుకుంటే నువ్వు ఇబ్బందుల్లో పడతావు’’ అంటూ బవానా నియోజకవర్గం ఆప్‌ అభ్యర్థిని ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌.. బహిరంగంగా బెదిరించిన వీడియోను కూడా పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ‘‘ఇది అమిత్‌షా గూండాగిరికి నిదర్శనం’’ అని అన్నారు. ‘అమిత్‌షా గూండాగిరి’ హ్యాష్‌ ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో ఆయన క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.


సీఎం అతీశిపై ఎఫ్‌ఐఆర్‌

సీఎం అతిశీపై ఢిల్లీలోని గోవిందపురి పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఎన్నికల నిబంధనావళిని సీఎం ఉల్లంఘించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారి తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని తెలిపారు. ‘‘సీఎం అతిశీ తన అనుచరులు 50-70 మందితో 10 వాహనాల్లో వచ్చి ఫతే సింగ్‌ మార్గ్‌ను బ్లాక్‌ చేశారు. ఇది కోడ్‌కు విరుద్ధం’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘంతో కేజ్రీవాల్‌, అతిశీ భేటీ అయ్యారు.


మరిన్ని వార్తల కోసం..

PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 05:13 AM