Karnataka Minister: అనుమతిస్తే పాక్‌లో మానవబాంబుగా పేలుతా
ABN , Publish Date - May 04 , 2025 | 04:50 AM
పాకిస్థాన్ ఉగ్రవాదులను అంతమొందించేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా అనుమతిస్తే తన ఒంటికి బాంబు కట్టి వెళ్లేందుకు సిద్ధమని కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి మరియు ఆయన భారతీయులంతా సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మంత్రి జమీర్ అహ్మద్ వ్యాఖ్యలు
బెంగళూరు, మే 3(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అనుమతిస్తే ఆత్మాహుతి బాంబుగా మారి పాకిస్థాన్‌లో ఉగ్రవాదులను పేల్చేస్తానని కర్ణాటక వక్ఫ్, వసతి శాఖల మంత్రి జమీర్ అహ్మద్ అన్నారు. మీడియా ఎదుట శుక్రవారం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘మేము భారతీయులం. హిందూస్థానీలం. పాకిస్థాన్‌తో మాకు ఎలాంటి సంబంధాలూ లేవు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే నా ఒంటికి బాంబును కట్టుకుని యుద్ధం కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు సిద్ధం’ అని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ భారత్‌కు ఎప్పుడూ శత్రువులేనని జమీర్ అహ్మద్ పేర్కొన్నారు. పహల్గాంలో దాడి నీచమైనదంటూ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సమయంలో భారతీయులంతా సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..