Extramarital Affair: వివాహేతర సంబంధం.. వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు
ABN , Publish Date - Oct 27 , 2025 | 06:57 PM
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక మహిళ కోసం వెళ్లిన వ్యక్తిని కట్టేసి దారుణంగా కొట్టిన ఘటన కర్ణాటకలోని బీదర్ జిల్లాలో చోటు చేసుకుంది. చింతకి గ్రామంలో ఉంటున్న విష్ణు(27)కి.. పెళ్లై, పిల్లలున్న మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 27: వివాహేతర సంబంధాలు చివరికి మరణానికి కారణం అవుతున్నాయి. క్షణం కాలం సంతృప్తి కోసం నేటి సమాజం అడ్డదారులు తొక్కుతోంది. చివరికి పరిస్థితి అగమ్యగోచరంగా మారి, శిక్షను అనుభవించే వరకు చేరుతోంది. ఇటీవల అనేక ఘటనలు జరుగుతున్నా.. సమాజంలో ఎలాంటి మార్పులు రావడం లేదు. రోజుకో కొత్త దారుణం జరుగుతూనే ఉంది. తాజాగా ఇలాంటి ఘటనే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక మహిళ కోసం వెళ్లిన వ్యక్తిని కట్టేసి దారుణంగా కొట్టిన ఘటన కర్ణాటకలోని బీదర్ జిల్లాలో చోటు చేసుకుంది. చింతకి గ్రామంలో ఉంటున్న విష్ణు(27)కి.. పెళ్లై, పిల్లలున్న మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల మహిళ తన పుట్టింటికి వెళ్లగా.. ఆమెను కలవడం కోసం ఈ నెల 21వ తేదీన గ్రామానికి విష్ణు వెళ్ళాడు. ఈ క్రమంలో విష్ణుని గుర్తించిన మహిళ తండ్రి, సోదరుడు.. అతడిని పట్టుకొని స్తంభానికి కట్టేసి కొట్టారు. 'మా ఇంటి ఆడబిడ్డతోనే సంబంధం పెట్టుకుంటావా?' అంటూ దూషిస్తూ దారుణంగా కొట్టి చంపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మహారాష్ట్రకి చెందినవాడిగా గుర్తించారు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanad: ముస్తఫాబాద్ ఇకపై కబీర్‌ధామ్ .. యోగి ప్రకటన
ECI: రెండో దశలో 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఎస్ఐఆర్.. ఈసీ కీలక ప్రకటన