Ranya Rao: యూట్యూబ్‌లో చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నా
ABN , Publish Date - Mar 14 , 2025 | 06:33 AM
కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు ప్రకంపనలు కన్నడ నాట కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ విచారణ చేపట్టగా తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది.

డీఆర్‌ఐకి ఇచ్చిన వాంగ్మూలంలో నటి రన్యా రావు
న్యూఢిల్లీ/బెంగళూరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు ప్రకంపనలు కన్నడ నాట కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ విచారణ చేపట్టగా తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. మరోపక్క రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) విచారించి వాంగ్మూలం నమోదు చేసింది. గతంలో తానెప్పుడు బంగారం స్మగ్లింగ్ చేయలేదని, ఇదే మొదటిసారి అని డీఆర్‌ఐ విచారణలో రన్యా రావు వెల్లడించారు.
బంగారాన్ని స్మగ్లింగ్ ఎలా చేశారో వివరించారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నానని చెప్పారు. గతంలో తానెప్పుడు దుబాయ్‌లో బంగారం కొనలేదని స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి అని ఆమె తెలిపారు. కాగా, రన్యారావు దుబాయి నుంచి తీసుకువచ్చిన కేజీల కొద్దీ బంగారం ఎక్కడికి వెళ్లిందని గురువారం హుబ్బళిలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి ప్రశ్నించారు.