Ranya Rao: అవును నేను బంగారం స్మగ్లింగ్ చేశా.. చాలా అలసిపోయా: కన్నడ నటి రాన్యా రావు
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:47 PM
14 కేజీల స్మగ్లింగ్ బంగారంతో ఇటీవల బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగిన రాన్యా రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఇచ్చిన వాంగ్మూలంలో రాన్యా రావు కొన్ని విషయాలను వెల్లడించింది. విదేశాల నుంచి 17 బంగారు బిస్కెట్లు తీసుకువచ్చినట్లు ఆమె అంగీకరించినట్టు ఎఫ్‌ఐఆర్ ద్వారా తెలిసింది.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన కన్నడ నటి రాన్యా రావు (Ranya Rao) ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 14 కేజీల స్మగ్లింగ్ బంగారంతో (Gold Smuggling) ఇటీవల బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగిన రాన్యా రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఇచ్చిన వాంగ్మూలంలో రాన్యా రావు కొన్ని విషయాలను వెల్లడించింది. విదేశాల నుంచి 17 బంగారు బిస్కెట్లు తీసుకువచ్చినట్లు ఆమె అంగీకరించినట్టు ఎఫ్‌ఐఆర్ ద్వారా తెలిసింది. ఏడాది కాలంగా తాను చేసిన విదేశీ టూర్ల గురించి కూడా ఆమె చెప్పింది. అలాగే ఆ పర్యటనల కారణంగా చాలా అలసిపోయినట్టు కూడా పేర్కొంది (Ranya Rao Arrest).
గత ఏడాది కాలంగా యూరోప్, అమెరికా, మిడిల్ ఈస్ట్, దుబాయ్, సౌదీ అరేబియా వంటి దేశాలకు వెళ్లినట్టు రాన్యా రావు తెలిపింది. ఈ విదేశీ పర్యటనల కారణంగా తాను విపరీతంగా అలసిపోయానని, తనకు తగినంత విశ్రాంతి లేదని ఆమె పేర్కొంది. రిమాండ్‌లో ఉన్న తనకు ఆహారం ఇస్తున్నారని, కానీ, తానేం తినడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తను జుడిషియల్ కస్టడీలో ఉన్నానని, న్యాయంపై నమ్మకం ఉందని తెలిపింది. ఎవరి వత్తిడీ లేకుండా, స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొంది.
రాన్యా రావు పలు కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈమె రెండో తండ్రి రాంచంద్రరావు కర్ణాటక పోలీసు హౌజింగ్ శాఖ డీజీపీ కావడంతో ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ చెకింగ్ లేకుండా నేరుగా ఆమెను బయటకు పంపేవారు. దీంతో ఆమె బంగారం స్మగ్లింగ్ చేయడం ప్రారంభించింది. అయితే తాజాగా సుమారు 15 కోట్ల విలువైన 14 కిలోల బంగారు కడ్డీలు ఆమె తీసుకెళ్తూ దొరికింది. కాగా, రాన్యా రావు చేసిన పని తనకు ఇప్పటివరకు తెలియదని, ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని డీజీపీ రాంచంద్రరావు స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..