Share News

Kamal Haasan On NEET: నీట్‌ రద్దు చేయాలి

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:05 AM

దేశంలోని వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష..

Kamal Haasan On NEET: నీట్‌ రద్దు చేయాలి

చెన్నై, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): దేశంలోని వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)ను రద్దు చేయాలని అగ్రనటుడు, రాజ్యసభ సభ్యుడు, ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ డిమాండ్‌ చేశారు. హీరో సూర్య సారథ్యంలోని అగరం ఫౌండేషన్‌ 15వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం చెన్నైలో జరిగాయి. ఈసందర్భంగా జరిగిన సభలో కమల్‌ ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ, అగరం ఫౌండేషన్‌లో విద్యాభ్యాసం చేసిన అనేక మంది విద్యార్థులు డాక్టర్లుగా, వివిధ హోదాల్లో కొనసాగుతున్నారని, అయితే 2017 నుంచి దీన్ని కొనసాగించడం కష్టసాధ్యంగా మారిందన్నారు. దీనికి కారణం నీట్‌ పరీక్ష ప్రధాన కారణమన్నారు. 2017 నుంచి ఈ రోజు వరకు అలాంటి విద్యావకాశాలు లేకుండా చేసింది నీట్‌ చట్టమన్నారు. ఆ చట్టం ఇపుడు ఎలాంటి ఆయుధం లేకుండా దేశాన్ని ధ్వసం చేస్తోందని ఆరోపించారు.


చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్

తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 04:05 AM