బెజోస్ పెళ్లి సందడి
ABN , Publish Date - Jun 30 , 2025 | 04:50 AM
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, జర్నలిస్టు లారెన్ సాంచెజ్ వివాహం వెనిస్ గ్రాండ్ కెనాల్‌లో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ...
వెనిస్, జూన్ 29: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, జర్నలిస్టు లారెన్ సాంచెజ్ వివాహం వెనిస్ గ్రాండ్ కెనాల్‌లో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు. సాధారణంగా పెళ్లి అనగానే సంగీత్, మెహందీ గుర్తొస్తాయి. కానీ బెజోస్, సాంచెజ్ కాస్త డిఫరెంట్‌గా ఫోమ్ పార్టీతో తమ పెళ్లి వేడుకలను మొదలుపెట్టారు. నురుగులో మునిగి తేలుతూ పార్టీ చేసుకుంటున్న బెజోస్, సాంచెజ్ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ వివాహం కోసం బెజోస్ దాదాపు రూ.470 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. యూర్‌పలో ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టిన వివాహం ఇదే అని తెలుస్తోంది.
Also Read:
యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..
నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...
For More Telugu News