Share News

Jarkhand Crime Incident: ఈ లేడి పెద్ద ఖతర్నాక్.. భర్తతోనే పురుగుల మందు కొనిపించి..

ABN , Publish Date - Jun 17 , 2025 | 04:21 PM

హనిమూన్ హత్య కేసు మరువకముందే.. పెళ్లయిన 36 రోజులకే భర్తను దారుణంగా చంపింది ఓ భార్య. ఈ ఘోరమైన ఘటన జార్ఖండ్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Jarkhand Crime Incident: ఈ లేడి పెద్ద ఖతర్నాక్.. భర్తతోనే పురుగుల మందు కొనిపించి..
Jarkhand Crime Incident

Jarkhand Crime Incident: హనిమూన్ హత్య కేసు మరువకముందే మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన 36 రోజులకే భర్తను అతి దారుణంగా చంపింది ఓ భార్య. ఈ ఘోరమైన ఘటన జార్ఖండ్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం విష్ణుపూర్‌ గ్రామానికి చెందిన రఘునాథ్‌ సింగ్‌ కుమార్తె సునీతను గత నెల మే 11న జార్ఖండ్‌ రాష్ట్రం గర్హ్వా జిల్లాలోని బహోకుందర్‌ గ్రామానికి చెందిన బుధ్‌నాథ్‌ సింగ్‌ అనే వ్యక్తికి ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. అయితే, వివాహం జరిగిన మరుసటి రోజే నవ వధువు సునీత తనకు భర్త అంటే ఏ మాత్రం ఇష్టం లేదని చెప్పి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, ఇరు కుటుంబాల పెద్దలు పంచాయతీ పెట్టి సునీతకు నచ్చజెప్పి మళ్లీ తనను కాపురానికి పంపించారు.

అయితే, భర్త అంటే ఇష్టం లేని సునీత తనను ఎలాగైనా చంపాలని స్కెచ్ వేసింది. ఈ నేపధ్యంలోనే గత శనివారం భర్తతో కలిసి సునీత మార్కెట్‌కు వెళ్లింది. అయితే, కూరగాయ చెట్లకు మందు కొట్టాలనే సాకుతో భర్తతో పురుగులమందు కొనిపించుకుంది. మరుసటి రోజు ఆదివారం రాత్రి భర్త తినే భోజనంలో ఆ మందు కలిపి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక రాత్రి భోజనం చేసి నిద్రపోయిన భర్త బుధ్‌నాథ్‌ నిద్రలోనే తన ప్రాణాలు కోల్పోయాడు.


మరుసటి రోజు ఉదయం బుధ్‌నాథ్‌ మృతి చెందాడని తెలుసుకున్న అతడి తల్లి, కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కోడలే కొడుకు తినే భోజనంలో విషం కలిపిందని పోలీసు అధికారులకు బాధిత తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు భార్య సునీతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Also Read:

101 మృతదేహాలు బంధువులకు అప్పగింత.. కొనసాగుతోన్న ప్రక్రియ

ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న 100 మంది భారతీయ విద్యార్థులు

For More National News

Updated Date - Jun 17 , 2025 | 04:21 PM