Reserve Forces: గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్ నుంచి 60వేల రిజర్వ్ బలగాలు!
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:20 AM
గాజాను స్వాధీనం చేసుకోవాలనే ప్రణాళికకు ఇజ్రాయెల్ రక్షణశాఖ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం గాజాలో మరో 60 వేల మంది రిజర్వ్ బలగాలను
టెల్ అవీవ్, ఆగస్టు 20: గాజాను స్వాధీనం చేసుకోవాలనే ప్రణాళికకు ఇజ్రాయెల్ రక్షణశాఖ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం గాజాలో మరో 60 వేల మంది రిజర్వ్ బలగాలను మోహరిస్తామని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు. ఇప్పటికే ఉన్న 20 వేల మంది రిజర్వ్ బలగాలకు వీరు అదనం. అయితే ఆపరేషన్ ఎప్పుడు ప్రారంభిస్తారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. వాస్తవానికి ఈ ప్రణాళికకు ఈ నెల 12నే ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి స్థాయి క్యాబినెట్ ఆమోదం పొందితే ఇది అమల్లోకి వస్తుంది.