Share News

IRCTC: మహా కుంభమేళా వెళ్లే భక్తులకు సూపర్ ఆఫర్.. ఐఆర్‌సీటీసీ సరికొత్త టూర్..

ABN , Publish Date - Jan 17 , 2025 | 03:33 PM

మహా కుంభమేళా వెళ్లే భక్తులకు ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్ ప్రకటించింది. భక్తుల కోసం స్పెషల్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం..

IRCTC: మహా కుంభమేళా వెళ్లే భక్తులకు సూపర్ ఆఫర్.. ఐఆర్‌సీటీసీ సరికొత్త టూర్..
IRCTC

IRCTC Maha Kumbh Mela Tour: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. దేశవిదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు ఇక్కడ పుణ్య స్నానం చేయడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దాదాపు 40 కోట్ల మందికిపైగా ఈ మహా కుంభమేళాకు వస్తారని అధికారుల అంచనా. జనవరి 14న ప్రారంభమైన మహా కుంభమేళా మొత్తం 45 రోజుల పాటు జరుగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణీకుల కోసం ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

దానాపూర్ ఎక్స్‌ప్రెస్..

తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం దానాపూర్ ఎక్స్‌ప్రెస్ జర్నీతో సరి కొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)ప్రయాణీకుల కోసం ఎప్పటికప్పుడు స్పెషల్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తోన్న సంగతి తెలిసిందే. ప్రయాణికుల అభిరుచులకు తగ్గట్టు అతి తక్కువ ఖర్చుతో ప్రత్యేక టూర్స్ ఆఫర్ చేస్తోంది. ఈ క్రమంలోనే మహా కుంభమేళా టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.


తెలుగు రాష్ట్రాల్లో..

మొత్తం 6 రోజులపాటు అంటే 5 రాత్రులు, 6 పగళ్ల పాటు ఈ ప్యాకేజీ ఉంటుంది. 3 రోజుల పాటు ఉదయం టిఫిన్, రాత్రిపూట భోజనం ఉంటుంది. అంతేకాకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఈ ట్రైన్​ జర్నీ హైదరాబాద్‌ నుంచి ప్రారంభమవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమంత్రి, ఏలురు, తుని, దువ్వాడ, విజయనగరం రైల్వే స్టేషన్లలో మహా కుంభమేళకు వెళ్లాలనుకునే భక్తులు ఈ ట్రైన్​ ఎక్కొచ్చు. ఈ టూర్‌లో భాగంగా భక్తులు వారణాసి కూడా కవర్ చేయవచ్చు.ఈ నెల 17, 19, 24 తేదీల్లో అదేవిధంగా వచ్చే నెల ఫిబ్రవరిలో 2, 7, 14, 16, 21 తేదీల్లో ఈ ఆధ్యాత్మిక యాత్ర టూర్ ప్రారంభం కానుంది.

టికెట్ ధరలు ఇలా ఉన్నాయి:

థర్డ్ ఏసీలో సింగిల్ షేరింగ్ - రూ. 48,730

డబుల్ షేరింగ్ - రూ. 31,610

ట్రిపుల్ షేరింగ్ - రూ. 29,390

5-11 ఏళ్ల చిన్నారుల కోసం..

(విత్ బెడ్) - రూ. 22,890

వితౌట్ బెడ్ - రూ. 14,650

స్లీపర్ క్లాస్‌‌లో సింగిల్ షేరింగ్ - రూ. 45,700

డబుల్ షేరింగ్ - రూ. 28,570

ట్రిపుల్ షేరింగ్ రూ. 26,360

5-11 ఏళ్ల చిన్నారులు:

విత్ బెడ్ రూ. 19,860

వితౌట్ బెడ్ - రూ. 11,620

ఈ టూర్ పూర్తి వివరాల కోసం IRCTC అఫీషియల్ వె‌బ్‌సైట్‌ www.irctc.co.in విజిట్ చేయండి.

Updated Date - Jan 17 , 2025 | 03:34 PM