Share News

Infosys: ఉద్యోగాలు తీసేశారు.. జోక్యం చేసుకోండి

ABN , Publish Date - Feb 28 , 2025 | 04:47 AM

బలవంతంగా తొలిగించిన తమ ఉద్యోగాలు తిరిగి ఇప్పించేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సామూహిక తొలగింపులు లేకుండా చూడాలని 100 మందికిపైగా ట్రైనీలు ఇటీవల పీఎంవోను అభ్యర్థించారు.

Infosys: ఉద్యోగాలు తీసేశారు.. జోక్యం చేసుకోండి

ప్రధాని కార్యాలయానికి ఇన్ఫోసిస్‌ ట్రైనీల వినతి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: తమకు న్యాయం చేయాలంటూ ఇన్ఫోసిస్‌ మైసూరు క్యాంప్‌సలో ఉద్యోగాలు కోల్పోయిన ట్రైనీలు ప్రధాని కార్యాలయాన్ని (పీఎంవో) ఆశ్రయించారు. బలవంతంగా తొలిగించిన తమ ఉద్యోగాలు తిరిగి ఇప్పించేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సామూహిక తొలగింపులు లేకుండా చూడాలని 100 మందికిపైగా ట్రైనీలు ఇటీవల పీఎంవోను అభ్యర్థించారు. దీనిపై స్పందించిన కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కర్ణాటక లేబర్‌ కమిషనర్‌కు 25వ తేదీన రెండోసారి నోటీసు పంపింది. ఇన్ఫోసిస్‌ నుంచి సామూహికంగా ఉద్యోగుల తొలగింపుపై విచారణ చేయాలని ఆ నోటీసులో కోరింది. కార్మిక చట్టాల ప్రకారం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఐటీ ఉద్యోగుల సంక్షేమాన్ని చూసే నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయిస్‌ సెనేట్‌కు కూడా ఆ నోటీసులు పంపింది. ఫిబ్రవరి7న మైసూరు క్యాంపస్‌ నుంచి సుమారు 700మంది ట్రైనీలను ఇన్ఫోసిస్‌ తొలగించింది. అంతర్గత మదింపు లో వారు విఫలమవడంతోనే తొలగించామని ఆ సంస్థ సమర్థించుకుంది.


మరిన్ని తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ

Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్

For National News And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 04:47 AM