Indigo Flight: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - Jun 21 , 2025 | 07:41 PM
గువహటి-చెన్నై ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయ్యాక విమానంలో ఇంధనం తక్కువగా ఉన్నట్టు గుర్తించిన పైలట్ వెంటనే..
Indigo Flight: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. పైలట్ అప్రమత్తతకు తోడు, 'మేడే' కాల్ సకాలంలో అందడంతో పెద్ద ప్రమాదం తప్పిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గువహటి నుంచి చెన్నై వెళుతున్న ఓ ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో ఇంధనం తక్కువగా ఉన్నట్లు పైలట్ గుర్తించారు. వెంటనే అలర్ట్ అయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు మేడే కాల్ ఇచ్చారు. అప్రమత్తమైన ఏటీసీ అధికారులు తక్షణమే స్పందించి సమీపంలోని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
సురక్షితంగా..
పైలట్ చాకచక్యంగా వ్యవహరించి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విమానాన్ని బెంగళూరులో సురక్షితంగా దించారు. దీంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మేడే కాల్
మేడే కాల్ అనేది డిస్ట్రెస్ కాల్. అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని ఏటీసీకి తెలియజేయడం కోసం దీన్ని వాడుతారు. ఆపదలో ఉన్నామని, తక్షణమే సాయం అవసరమని విజ్ఞప్తి చేసేందుకు పైలట్ దీనిని ఉపయోగిస్తారు. మేడే కాల్ ద్వారానే ఇండిగో విమానం సేఫ్‌గా బయటపడింది. లేదంటే మరోసారి ఘోర ప్రమాదం జరిగేది.
Also Read:
వార్నీ.. ఇదెక్కడి తెలివిరా అయ్యా.. రైల్లో ఫోన్ చార్జింగ్ ఎలా చేస్తున్నారో చూడండి..
తప్ప తాగి ఒంటెపై సవారీ.. మృత్యు దారిలో పరుగో పరుగు..
For More National News