Share News

IndiGo Flight: ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి

ABN , Publish Date - Jun 03 , 2025 | 05:27 AM

పట్నా నుంచి రాంచీకి వస్తున్న ఇండిగో విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. ప్రమాదం తప్పించి విమానాన్ని రాంచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయించారు.

IndiGo Flight: ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి

రాంచీ, జూన్‌ 2: ఇండిగో విమానానికి సోమవారం ప్రమాదం తప్పింది. దాదాపు 175 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో ఎయిర్‌బస్‌ 320 విమానాన్ని రాబందు ఢీ కొట్టింది. దీంతో ఆ విమానాన్ని రాంచీలోని బిస్రా ముండా విమానాశ్రయంలో అత్యవసరంగా దింపాల్సి వచ్చిందని ఓ అధికారి తెలిపారు. విమానం రాంచీకి దాదాపు 10 నుంచి 12 నాటికల్‌ మైళ్ల దూరంలో 3-4వేల అడుగుల ఎత్తులో ఉండగా పక్షి ఢీకొన్నదని, దీంతో పైలెట్‌ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చిందని విమానాశ్రయ డైరెక్టర్‌ ఆర్‌ఆర్‌ మౌర్య పేర్కొన్నారు. పట్నా నుంచి రాంచీకి విమానం వస్తుండగా మధ్యాహ్నం 1.14 గంటలకు ఈ ఘటన జరిగింది.


ఇవీ చదవండి:

కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్

పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 05:27 AM