Bomb Threats: ఇండిగోకు బాంబు బెదిరింపులు.. ఆ ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్.!
ABN , Publish Date - Nov 12 , 2025 | 06:30 PM
ఇండిగోకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ ఒకటి వచ్చింది. దీంతో మొత్తం ఐదు ప్రధాన విమానాశ్రయాలకు హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, తిరువనంతపురం, హైదరాబాద్ సహా అనేక నగరాల్లో ఎయిర్‌పోర్టులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
ఇండిగోకు వచ్చిన ఇ-మెయిల్‌తో అప్రమత్తమైన అధికారులు.. ముంబయి నుంచి వారణాసికి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని తక్షణమే ఖాళీ చేయించారు. అనంతరం ఆ విమానంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలోనూ ఇమ్మీడియట్ హైఅలర్ట్ ప్రకటించారు. ఓ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసి.. ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించారు. అయితే.. ఈ తనిఖీల్లో ఇప్పటివరకూ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి:
ఢిల్లీ పేలుడు బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన మోదీ
ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్.. ఎలా జరిగిందో చూడండి.. సీసీటీవీ వీడియో వైరల్..