Indus Waters Treaty: భారత్ అలా చేస్తే పాకిస్తాన్‌లో వినాశనమే..
ABN , Publish Date - Nov 01 , 2025 | 09:41 PM
పాకిస్తాన్‌లోని 80 శాతం వ్యవసాయం సింధు జలాల మీదే ఆధారపడి సాగుతోంది. సింధు జలాలు పూర్తిగా ఆగిపోతే తట్టుకునే శక్తి పాకిస్తాన్‌కు లేదు. అది నేరుగా ఆహార భద్రతపై ప్రభావం చూపుతుంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. భారత్ సింధు జలాల సరఫరాను నిలిపి వేయటంతో పాక్ కరువుతో కటకటలాడిపోతోంది. నీళ్లు ఇవ్వమంటూ కాళ్ల బేరానికి వచ్చింది. అయినా భారత్ మాత్రం నీటిని వదల్లేదు. అలాగని పూర్తి స్థాయిలో నీటిని ఆపలేదు. కొంత నీరు పాక్‌కు వెళుతోంది. భారత్ గనుక ఇకపై సింధు జలాల సరఫరాను పూర్తి స్థాయిలో అడ్డుకుంటే.. దాన్ని తట్టుకునే శక్తి పాకిస్తాన్‌కు లేదని ఓ నివేదిక వెల్లడించింది.
సిడ్నీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకానమిక్స్ అండ్ పీస్ ‘ఎకలాజికల్ ట్రీట్ రిపోర్ట్ 2025’ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. పాకిస్తాన్‌లోని 80 శాతం వ్యవసాయం సింధు జలాల మీదే ఆధారపడి సాగుతోంది. సింధు జలాలు పూర్తిగా ఆగిపోతే తట్టుకునే శక్తి పాకిస్తాన్‌కు లేదు. అది నేరుగా ఆహార భద్రతపై ప్రభావం చూపుతుంది. భారత్ నుంచి పాక్‌కు చేరుతున్న నీటిని పెద్ద మొత్తంలో స్టోర్ చేసుకునే సామర్థ్యం పాక్‌కు లేదు.
సింధు జలాలను 30 రోజులు వాడుకునేందుకు మాత్రమే స్టోర్ చేసుకోగలదు. భారత్ పూర్తిగా సింధు జలాలను నిలిపివేసినా.. లేదా ఇప్పుడు ఉన్న ప్రవాహాన్ని తగ్గించినా పాకిస్తాన్ వ్యవసాయ రంగంపై కొంతకాలం పాటు పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుంది’ అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
ఈ అగరబత్తీ చాలా పవర్‌ఫుల్.. ఈ మహిళకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
గోల్డ్ బీన్ మింగేసిన బాలుడు.. ఐదు రోజులు అయినా కూడా..