Boy Swallows Gold Bean: గోల్డ్ బీన్ మింగేసిన బాలుడు.. ఐదు రోజులు అయినా కూడా..
ABN , Publish Date - Nov 01 , 2025 | 08:38 PM
ఓ బాలుడు ఆడుకుంటూ పొరపాటున బంగారంతో తయారు చేసిన బీన్‌ను మింగేశాడు. ఆ బీన్ పిల్లాడి కడుపులో ఐదు రోజుల పాటు ఉండిపోయింది.
11 ఏళ్ల ఓ బాలుడు పొరపాటున గోల్డ్ బీన్ మింగేశాడు. ఆ గోల్డ్ బీన్ ఐదు రోజుల పాటు అతడి కడుపులోనే ఉండిపోయింది. డాక్టర్లు అతి కష్టం మీద దాన్ని బయటకు తీశారు. ఈ సంఘటన చైనాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జియాంగ్షూ ప్రావిన్స్‌లోని కున్షన్ ప్రాంతానికి చెందిన జీ అనే మహిళ అక్టోబర్ 17వ తేదీన బంగారంతో తయారు చేసిన బీన్(విత్తనం) కొనుగోలు చేసింది. పది గ్రాముల దాని విలువ 1,20,000 రూపాయలుపైనే ఉంటుంది.
అక్టోబర్ 22వ తేదీన 11 ఏళ్ల జీ కొడుకు ఆ గోల్డ్ బీన్‌తో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో జీ బాల్కనీలో బట్టలు ఉతుకుతూ ఉంది. కొద్దిసేపటి తర్వాత జీ కొడుకు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆ బాలుడు భయంభయంగా.. ‘అమ్మా నేను ఆడుకుంటూ పొరపాటున ఆ గోల్డ్ బీన్ మింగేశాను. చచ్చిపోతానేమో.. భయంగా ఉందమ్మా’ అని అన్నాడు. జీ అతడి మాటలు నమ్మలేదు. జోక్ చేస్తున్నాడని అనుకుంది. గోల్డ్ బీన్ ఇంట్లో కనిపించకపోయే సరికి అతడి మాటలు నమ్మింది.
జీ తన కొడుక్కి ధైర్యం చెప్పింది. ‘భయపడాల్సిన అవసరం లేదు. ఉదయం మలం ద్వారా అది బయటకు వస్తుందిలే.. నువ్వు మల విసర్జనకు బయటకు వెళ్లకు’ అని చెప్పింది. అయితే, ఐదు రోజులు గడుస్తున్నా కూడా అది బయటకు రాలేదు. దీంతో జీ భయపడిపోయింది. అక్టోబర్ 26వ తేదీన కొడుకును కున్షన్ ఫిఫ్త్ పీపుల్స్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలుడ్ని పరీక్షించిన వైద్యులు కడుపులో ఏదో ఉన్నట్లు గుర్తించారు. మరుసటి రోజు దాన్ని బయటకు తీసి జీకి ఇచ్చారు. దీంతో జీ సంతోషం వ్యక్తం చేసింది. బంగారు వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచాలని సలహా ఇస్తోంది.
ఇవి కూడా చదవండి
ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. ఏమైందంటే..
నైట్ షిఫ్ట్‌లో ఉద్యోగుల మధ్య గొడవ.. ఆఫీస్‌లో దారుణ హత్య..