Share News

India's gold demand: బంగారమంటే భయపడుతున్నారు

ABN , Publish Date - Apr 30 , 2025 | 06:22 PM

బంగారమంటే అందరికీ బంగారమే. ఇండియాలో అయితే, దీని మోజు మరీ అధికం. అయితే, ఈ మధ్య బంగారం అంటే జనం కాస్త వెనుకంజ వేస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి.

India's gold demand: బంగారమంటే భయపడుతున్నారు
India's gold demand

India's gold demand falls: జనవరి-మార్చి మూడు నెలల కాలంలో బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో భారతదేశంలో బంగారం డిమాండ్ 15% తగ్గి, డిమాండ్ 118.1 టన్నులకు చేరుకుంది. "ఈ సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో భారతదేశ బంగారం డిమాండ్ 15% తగ్గి 118.1 టన్నులకు చేరుకుంది. అయినప్పటికీ ధరల పెరుగుదల కారణంగా మార్కెట్ విలువ 22% పెరిగి ₹94,030 కోట్లకు చేరుకుంది" అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది.

WGC అంచనా ప్రకారం, 2025 నాటికి ఇండియాలో బంగారం డిమాండ్ 700-800 టన్నుల మధ్య ఉంటుందని అంచనా. 2025 ప్రారంభం నుండి బంగారం ధరలు 25% పెరిగాయి. ఇది 10 గ్రాములకు ₹1,00,000 అనే ల్యాండ్ మార్క్ దగ్గరకి వెళ్లింది. ఇది వినియోగదారుల కొనుగోలు విధానాలను ప్రభావితం చేసింది. వారిని కొంచెం వెనకడుగువేసే పరిస్థితుల్ని కల్పించింది.

"పెరిగిన ధరలు బంగారం కొనుగోలును ప్రభావితం చేశాయి. అయినప్పటికీ, ముఖ్యంగా అక్షయ తృతీయ, రాబోయే పెళ్లిళ్ల సీజన్ కారణంగా మళ్లీ బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటాయని WGC ఇండియా CEO సచిన్ జైన్ తన త్రైమాసిక నివేదికలో తెలిపారు. కాగా, జనవరి-మార్చి త్రైమాసికంలో బంగారం దిగుమతులు 8% పెరిగి 167.4 టన్నులకు చేరుకున్నాయి.


ఇవి కూడా చదవండి

Tirupati Case: వృద్ధురాలిది హత్యే.. తేల్చేసిన తిరుపతి పోలీసులు

Modi Amaravati Visit: ప్రధాని పర్యటన ఏర్పాట్లు పూర్తి.. ఆ రెండే కీలకమన్న మంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 30 , 2025 | 06:26 PM