Share News

రెండోసారి ఆస్తుల నగదీకరణ!

ABN , Publish Date - Feb 02 , 2025 | 04:47 AM

ఐదేళ్లలో ప్రభుత్వ ఆస్తులను నగదీకరించడం ద్వారా రూ.10 లక్షల కోట్ల సాధనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దేశంలో కొత్త మౌలిక సదుపాయాల కల్పనకు ఈ సొమ్మును వినియోగించనున్నారు.

రెండోసారి ఆస్తుల నగదీకరణ!

ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లు లక్ష్యం

బడ్జెట్‌లో వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం రెండోసారి ఆస్తుల నగదీకరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. 2025-30 మధ్య ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఐదేళ్లలో ప్రభుత్వ ఆస్తులను నగదీకరించడం ద్వారా రూ.10 లక్షల కోట్ల సాధనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దేశంలో కొత్త మౌలిక సదుపాయాల కల్పనకు ఈ సొమ్మును వినియోగించనున్నారు. ఈ ప్రణాళికను విజయవంతంగా అమలు చేసేందుకు గాను నియంత్రణ, ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపర్చనున్నట్లు మంత్రి తెలిపారు. తొలిసారి 2021లో ప్రవేశపెట్టిన ఆస్తుల నగదీకరణ విజయవంతమైందని, ఈ కార్యక్రమం ద్వారా రూ.6 లక్షల కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు చెప్పారు. అప్పట్లో తొలి రెండేళ్ల (2021-22, 2022-23)కు రూ.2.5 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.2.3 లక్షల కోట్లు సాధించినట్లు తెలిపారు. అలాగే 2023-24లో రూ.1.8 లక్షల కోట్లకు గాను రూ.1.56 లక్షల కోట్లు సాధించినట్లు వివరించారు. తొలి ప్రణాళిక విజయవంతమైన నేపథ్యంలో 2025-30కి గాను రూ.10 లక్షల కోట్లు లక్ష్యంగా రెండోసారి ఆస్తుల నగదీకరణను ప్రారంభిస్తున్నట్లు నిర్మల చెప్పారు. 2023-24లో రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, బొగ్గు గనుల శాఖలు ఆస్తుల నగదీకరణ ద్వారా అత్యధికంగా రూ.97 వేల కోట్లు సాధించాయని తెలిపారు.


ఇవీ చదవండి:

ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 04:48 AM