Air India Flight: ఏఐ విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన
ABN , Publish Date - Apr 09 , 2025 | 08:44 PM
తాగిన మత్తులో ఉన్న ఒక ఇండియన్ పాసింజర్ తన తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బిజినెస్ క్లాస్‌లో ఈ ఘటన జరిగినట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానం AI 2336లో బుధవారంనాడు షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తాగిన మత్తులో ఉన్న ఒక ఇండియన్ పాసింజర్ తన తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బిజినెస్ క్లాస్‌లో ఈ ఘటన జరిగినట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. అయితే దీనికి కారణం ఏమిటనేది వెల్లడించలేదు.
Mallikarjun Kharge: బాధ్యత తీసుకోండి లేదా రిటైర్ కండి: నేతలకు ఖర్గే వార్నింగ్
కాగా, అనుచిత ప్రవర్తనకు పాల్పడిన ప్యాసింజర్ ఒక పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అని, జరిగిన పొరపాటుకు అతను క్షమాపణ చెప్పాడని తెలుస్తోంది. ఫ్లయిట్ సిబ్బంది ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా అధికారులు తెలియజేయడంతో వారు బాధిత ప్యాసింజర్‌కు బ్యాంకాక్‌లో తగిన సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. కానీ, అందుకు బాధితుడు నిరాకరించినట్టు ఒక ప్రకటనలో ఏఐ తెలిపింది.
రామ్మోహన్ నాయుడు స్పందన
ఈ ఘటనపై పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెంటనే స్పందించారు. ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరిగినా మంత్రిత్వ శాఖ సత్వరం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎయిర్‌లైన్స్‌తతో మాట్లాడి ఏదైనా తప్పు జరిగితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.