Share News

Shukla Honored by Rajnath Singh: అంతరిక్షంలోకి వెళ్తాననుకోలేదు

ABN , Publish Date - Aug 25 , 2025 | 03:40 AM

బాల్యంలో తాను చాలా బిడియస్థుడినని, ఎవరితోనూ కలిసేవాడిని కాదని భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా తెలిపారు..

Shukla Honored by Rajnath Singh: అంతరిక్షంలోకి వెళ్తాననుకోలేదు

  • చిన్నప్పుడు చాలా బిడియస్థుడిని: శుభాన్షు శుక్లా

  • గగన్‌యాన్‌ యాత్రికులకు రాజ్‌నాథ్‌ సన్మానం

న్యూఢిల్లీ, ఆగస్టు 24: బాల్యంలో తాను చాలా బిడియస్థుడినని, ఎవరితోనూ కలిసేవాడిని కాదని భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్తానని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. ఆదివారం భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిన్నతనంలో రాకేశ్‌శర్మ అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన కథలు వింటూ పెరిగానని గుర్తుచేసుకున్నారు. అయితే అప్పట్లో నింగిలోకి వెళ్లాలనే ఆలోచన లేదన్నారు. మరోవైపు, గగన్‌యాన్‌ వ్యోమగాములు శుభాన్షు శుక్లా, పి.వి. నాయర్‌, అజిత్‌ కృష్ణన్‌, అంగద్‌ ప్రతా్‌పను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సన్మానించారు. అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ ఆకాంక్షలకు ప్రతీకలుగా నిలిచిన వీరు మన దేశానికి గర్వకారణమని ప్రశంసించారు. ‘‘నాది లఖ్‌నవూ పార్లమెంట్‌ నియోజకవర్గం. శుభాన్షు శుక్లా అక్కడివాడే. అతను కూడా మా ఓటరు’’ అని రాజ్‌నాథ్‌ అన్నారు.


ఇవి కూడా చదవండి..

మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు

రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక

రాహుల్ యాత్రలో మళ్లీ అపశృతి

For More National News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 04:54 AM