India Mine Sweepers: మైన్‌స్వీపర్ల నిర్మాణానికి రూ.44 వేల కోట్లు!
ABN , Publish Date - May 27 , 2025 | 05:21 AM
భారత నేవీ కోసం 12 అడ్వాన్స్‌డ్ మైన్ స్వీపర్లను దేశీయంగా తయారు చేయడానికి ₹44 వేల కోట్ల ప్రాజెక్ట్‌పై అనుమతి ఇవ్వబోతుంది. ఇవి సముద్ర నౌకాశ్రయాల్లోని మైన్లను గుర్తించి తొలగించడంలో కీలకంగా ఉంటాయి.
చైనా దూకుడుతో భారత నేవీ అప్రమత్తం
న్యూఢిల్లీ, మే 26: శత్రు దేశాలు నీటి లోపల పెట్టే మందుపాతరలను గుర్తించి నిర్వీర్యం చేయగలిగే అడ్వాన్స్‌డ్ మైన్ స్వీపర్లను భారత్ తయారుచేయనుంది. నేవీ కోసం దేశీయంగా వీటిని నిర్మించే యోచన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. మొత్తం 44 వేల కోట్ల రూపాయలతో 12 అడ్వాన్స్‌డ్ మైన్ స్వీపర్లను నిర్మించేందుకు రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి అనుమతిచ్చే అవకాశాలున్నాయి. అనుమతి లభించాక ఇవి నేవీకి అందుబాటులోకి రావడానికి 7 నుంచి 8 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. భారత్‌లో 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతంతో పాటు 200 చిన్న, 13 పెద్ద నౌకాశ్రయాలు ఉన్నా ఇప్పటివరకూ ఈ తరహా మైన్ స్వీపర్లు అందుబాటులో లేవు. పైగా సముద్ర జలాల్లో చైనా దూకుడుగా ఉంది. ఈ తరుణంలో మైన్ స్వీపర్లను సమకూర్చుకోవడం భారత నేవీకి కీలకంగా మారింది.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News