Share News

Tourism Growth: 50 పర్యాటక ప్రదేశాల అభివృద్ధి

ABN , Publish Date - Feb 02 , 2025 | 04:44 AM

తద్వారా ఉద్యోగ కల్పనతోపాటు ఆయా ప్రాంతా ల్లో మౌలిక వసతులు మెరుగవుతాయన్నారు. దీన్ని ‘ఉపాధి కోసం పర్యాటకం-వృద్ధికి ఊతం’గా ఆమె పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలకు వచ్చేందుకు రోడ్లు, ఇతర వసతులను కల్పించేందుకు రాష్ట్రాలకు రుణాలతోపాటు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నారు.

Tourism Growth: 50 పర్యాటక ప్రదేశాల అభివృద్ధి

రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 : రాష్ట్రాల భాగస్వామ్యంతో దేశంలోని 50 ప్రధాన పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తద్వారా ఉద్యోగ కల్పనతోపాటు ఆయా ప్రాంతా ల్లో మౌలిక వసతులు మెరుగవుతాయన్నారు. దీన్ని ‘ఉపాధి కోసం పర్యాటకం-వృద్ధికి ఊతం’గా ఆమె పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలకు వచ్చేందుకు రోడ్లు, ఇతర వసతులను కల్పించేందుకు రాష్ట్రాలకు రుణాలతోపాటు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నారు. విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు ఈ వీసా సదుపాయంతోపాటు వీసా రుసుం తగ్గింపు కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లోని హోమ్‌ స్టేస్‌ నిర్వాహకులకు ముద్రా రుణాలు, హోటళ్లకు రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దేశంలోని బౌద్ధ వారసత్వ ప్రదేశాలకు రోడ్లు, ఇతర వసతులను కల్పించేందుకూ నిధులు కేటాయించనున్నారు. ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో ‘హీల్‌ ఇన్‌ ఇండియా’ పేరిట వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించనున్నారు. ఇందుకు విదేశీ రోగులకు వీసా నిబంధనలు సడలిస్తారు. దేశంలో స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


ఇవీ చదవండి:

ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 04:44 AM