Military Hardware: భారత్‌కు రూ.1100 కోట్ల సైనిక సామగ్రి సరఫరాకు అమెరికా ఆమోదం
ABN , Publish Date - May 02 , 2025 | 04:20 AM
భారత్‌కు సుమారు రూ.1109 కోట్ల విలువైన సైనిక సామగ్రి సరఫరాకు అమెరికా ఆమోదం తెలిపింది. ఇండో-పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ఒప్పందం జరుగనుంది.
న్యూఢిల్లీ, మే 1: భారత్‌కు 131 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.1109 కోట్లు) విలువైన సైనిక సామగ్రి (మిలటరీ హర్డ్‌వేర్) సరఫరాకు అమెరికా ఆమోదం తెలిపింది. అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే డిఫెన్స్ సెక్యూరిటీ కార్పొరేషన్ ఏజెన్సీ(డీఎ్‌ససీఏ) ఈ మేరకు అమెరికా కాంగ్రె్‌సకు సమాచారం అందజేసింది. ఇండో-పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కింద ఈ విక్రయం జరగనుంది. లాజిస్టిక్స్ అవసరాలకు వాడే సామగ్రి, సీ(సముద్రం) విజన్ డాక్యుమెంటేషన్‌తోపాటు సీ-విజన్ సాఫ్ట్‌వేర్, రిమోట్ సాఫ్ట్‌వేర్ కొనుగోలుకు భారత్ ప్రతిపాదనలు పంపినట్టు డీఎ్‌ససీఏ పేర్కొంది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడగా.. దీనిపై భారత ప్రభుత్వం స్పందించలేదు. అమెరికా ఆయుధాలు, ఆయుధ సామగ్రి వినియోగం దిశగా భారత్‌ను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న వేళ ఈ ఆమోదం లభించింది.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News