Share News

Indias Telecom Boom: టెలికమ్యూనికేషన్స్‌లో దూసుకెళ్తున్న భారత్‌

ABN , Publish Date - May 07 , 2025 | 06:00 AM

భారతదేశం టెలికాం రంగంలో విశేష పురోగతి సాధించి, 850 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులతో ప్రపంచంలోనే అత్యంత చౌక డేటా సేవలు అందిస్తోంది. 5జీ ఎకోసిస్టమ్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినట్లు మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు

Indias Telecom Boom: టెలికమ్యూనికేషన్స్‌లో దూసుకెళ్తున్న భారత్‌

  • టెలికాం-2025 సదస్సులో కేంద్రమంత్రి పెమ్మసాని వెల్లడి

న్యూఢిల్లీ, మే 6(ఆంధ్రజ్యోతి): ప్రతిభ, టెక్నాలజీతో టెలికమ్యూనికేషన్స్‌లో ప్రపంచస్థాయిలో భారత్‌ దూసుకెళ్తోందని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధిశాఖల సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పారు. ఢిల్లీలోని తాజ్‌ప్యాలె్‌సలో మంగళవారం జరిగిన ‘భారత్‌ టెలికాం-2025’ సదస్సులో ఆయన మాట్లాడారు. 850 మిలియన్లకుపైగా ఇంటర్నెట్‌ వినియోగదారులతో భారతదేశం గణనీయమైన మైలురాళ్లను సాధించిందన్నారు. ప్రపంచంలోనే అత్యంత చౌక రేట్లతో డేటాను భారత్‌ అందిస్తోందని తెలిపారు. టెలికాం పరికరాల ఎగుమతి ఇటీవలి సంవత్సరాలలో నాలుగు రెట్లు పెరిగి మొత్తం విలువ రూ.1.49 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, సొల్యూషన్స్‌ ఆధారంగా 5జీ ఎకోసిస్టమ్‌ను రూపొందించినట్లు తెలిపారు.

Updated Date - May 07 , 2025 | 06:00 AM