Share News

Henley Passport Index: హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో భారత్‌ ర్యాంక్‌ మెరుగు

ABN , Publish Date - Jul 23 , 2025 | 04:15 AM

హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో భారత్‌ తన ర్యాంకును మెరుగుపరుచుకుంది.

Henley Passport Index: హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో భారత్‌ ర్యాంక్‌ మెరుగు
Henley Passport Index

న్యూఢిల్లీ, జూలై 22: హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో భారత్‌ తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. మంగళవారం విడుదలైన హెన్లీ పాస్‌పోర్ట్‌ సూచికలో భారతదేశ పాస్‌పోర్టు ఎనిమిది స్థానాలను మెరుగుపరుచుకొని 77వ స్థానంలో నిలిచింది. గతేడాది 85వ స్థానంలో ఉంది. హెన్లీ పాస్‌పోర్ట్‌ సూచిక ప్రపంచ దేశాల పాస్‌పోర్టుల బలాలను ర్యాంకింగ్‌ రూపంలో ప్రకటిస్తుంది. ఈ సూచికలో ఒక దేశ పౌరులు వీసా లేకుండా ఎన్ని దేశాలకు ప్రయాణించగలరో నిర్ధారిస్తారు. భారతదేశ పాస్‌పోర్టుతో పౌరులు 59 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా ఆన్‌ అరైవల్‌ ద్వారా వెళ్లిరావచ్చు. మరోవైపు సింగపూర్‌ పాస్‌పోర్టు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. సింగపూర్‌ పాస్‌పోర్ట్‌ దారులు వీసా లేకుండా 193 దేశాలు ప్రయాణించవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 04:15 AM