Pulwama Attack: పుల్వామా అమరులకు ఘన నివాళులు
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:00 AM
ఈ ఘటన జరిగి శుక్రవారానికి ఆరేళ్లు అయిన సందర్భంగా దేశ సేవలో ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లకు దేశవ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. అమర సైనికుల త్యాగం మరువలేనిదని ప్రజలు గుర్తుచేసుకున్నారు.

వీర జవాన్ల త్యాగాలను దేశం మరువదు: ప్రధాని
న్యూఢిల్లీ/శ్రీనగర్, ఫిబ్రవరి 14: అది భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు.. 2019, ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన జరిగి శుక్రవారానికి ఆరేళ్లు అయిన సందర్భంగా దేశ సేవలో ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లకు దేశవ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. అమర సైనికుల త్యాగం మరువలేనిదని ప్రజలు గుర్తుచేసుకున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా పార్టీలకు అతీతంగా నేతలు నివాళులు తెలిపారు. దేశం పట్ల అమర జవాన్ల అంకితభావం ఎన్నటికీ మరువలేనిదని మోదీ పేర్కొన్నారు. ‘2019 పుల్వామా దాడిలో అమరులైన మన వీర జవాన్లకు నివాళులు.
మీ త్యాగం, దేశం పట్ల అచంచలమైన అంకితభావాన్ని రాబోవు తరాలు ఎన్నటికీ మరిచిపోవు’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. పుల్వామా ఘటనను ఖండించిన అమిత్‌షా.. దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. పుల్వామా వీర జవాన్లకు దేశం రుణపడి ఉందని, వారి త్యాగాలకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. అమర జవాన్లను స్మరించుకుంటూ సీఆర్‌పీఎఫ్ పుల్వామా జిల్లాలోని లెత్‌పోరాలో కార్యక్రమం నిర్వహించింది.
ఇవి కూడా చదవండి...
PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు
CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ
Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.