Randhir Jaiswal: గగనతలాన్ని నిరాకరించ లేదు.. పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన భారత్
ABN , Publish Date - Dec 02 , 2025 | 09:09 PM
మానవతాసాయంతో కూడిన విమానానికి భారత్ క్లియరెన్స్ ఇవ్వలేదంటూ పాక్ చేసిన ప్రకటనను ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మంగళవారంనాడు జరిపిన మీడియా సమావేశంలో తప్పుపట్టారు.
న్యూఢిల్లీ: శ్రీలంకకు మానవతా సాయాన్ని తీసుకువెళ్తున్న తమ విమానాన్ని భారత గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించడం లేదంటూ పాకిస్థాన్ చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తి అసంబద్ధమైన ప్రకటన అని, ఇండియాకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేందుకు పాక్ జరిపిన మరో ప్రయత్నమని పేర్కొంది. పాక్ నుంచి అభ్యర్థన అందిన 4 గంటల్లోనే అనుమతి ఇచ్చామని స్పష్టం చేసింది.
మానవతాసాయంతో కూడిన విమానానికి భారత్ క్లియరెన్స్ ఇవ్వలేదంటూ పాక్ చేసిన ప్రకటనను ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) మంగళవారంనాడు జరిపిన మీడియా సమావేశంలో తప్పుపట్టారు. 'పాకిస్థాన్ విదేశాంగ శాఖ చేసిన ప్రకటనలో నిజం లేదు. భారతకు వ్యతిరేకంగా జరుపుతున్న మరో తప్పుడు ప్రచారం ఇది' అని తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తమ విమానానికి అనుమతి కోరుతూ ఇస్లామాబాద్‌లోని ఇస్లామాబాద్ ఇండియన్ హైకమిషన్‌కు అభ్యర్థన వచ్చిందని, మానవతా సాయం కావడంతో భారత ప్రభుత్వం అదే రోజు క్లియరెన్స్ ఇచ్చిందని ఎంఈఏ తెలిపింది. సాయంత్రం 5.30 గంటలకు అధికారంగా అనుమతి మజూరు చేనట్టు వెల్లడించింది. దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి అంతర్జాతీయ సాయం కోసం అభ్యర్థన చేసింది. మొదటిగా స్పందించిన భారత ప్రభుత్వం 'ఆపరేషన్ సాగర్ సింధు' కింద భారీ ఎత్తున సహాయ సామగ్రిని పంపింది. శ్రీలంకను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసో ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
తేదీలు ఫిక్స్.. 8న వందేమాతరం, 9న ఎన్నికల సంస్కరణలపై చర్చ
సెల్‌ఫోన్స్‌లో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి.. ఫోన్ తయారీదార్లకు కేంద్రం ఆదేశాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి