Shashi Tharoor: కాంగ్రెస్‌ను కాదని శశిథరూర్‌కు పట్టం

ABN , First Publish Date - 2025-05-18T05:15:17+05:30 IST

పాక్‌ కుట్రలను ప్రపంచానికి వెల్లడించేందుకు భారత్‌ "దౌత్య యుద్ధం"ను ప్రారంభించింది. అయితే కాంగ్రెస్‌ సూచించిన నేతలను పక్కన పెట్టి, శశి థరూర్‌ను కేంద్రం ఎంపిక చేయడం రాజకీయ వివాదంగా మారింది. దళపతి ఎంపీలుగా ఏడు బృందాలను కేంద్రం నియమించింది.

Shashi Tharoor: కాంగ్రెస్‌ను కాదని శశిథరూర్‌కు పట్టం

అఖిలపక్ష బృందాల్లో ఒకదానికి నేతృత్వం

మోదీ సర్కారు సంచలన నిర్ణయం

మండిపడ్డ కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌

కాంగ్రె్‌సలో ఉండటం వేరు.. కాంగ్రె్‌సతో ఉండటం వేరని వ్యాఖ్య

దౌత్య ప్రచారానికి ఎంపీలతో 7 బృందాలు

ఇండియా కూటమి నుంచి ముగ్గురికి నేతృత్వం

ప్రపంచవ్యాప్తంగా పాక్‌ను ఎండగట్టడం లక్ష్యం

న్యూఢిల్లీ, మే 17 (ఆంధ్రజ్యోతి): పాక్‌ కుతంత్రాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు భారత్‌ దౌత్య యుద్ధాన్ని ఆరంభించింది. అయితే.. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించిన నాలుగు పేర్లను కాదని.. ఓ బృందానికి కేంద్ర ప్రభుత్వం శశిథరూర్‌ను ఎంపిక చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఏడాది కాలంగా శశిథరూర్‌ కాంగ్రె్‌సతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండడం.. ఇటీవల ప్రధాని మోదీ కూడా కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనను పొగడడం తెలిసిందే..! ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శశిథరూర్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘కాంగ్రె్‌సలో ఉండడం వేరు.. కాంగ్రె్‌సతో ఉండడం వేరు’’ అని వ్యాఖ్యానించారు. సున్నితమైన విషయాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. క్రికెట్‌ పరిభాషలో ‘బాడీలైన్‌(నిబంధనలకు విరుద్ధం)’ను ఉటంకిస్తూ.. ‘‘కాంగ్రెస్‌ నిబంధనల ప్రకారం ఆడుతుంటే.. బీజేపీ బాడీలైన్‌ ఆడుతోంది’’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. ‘‘కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు మా పార్టీ అధ్యక్షుడు ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీని.. అఖిలపక్షం బృందాలకు పేర్లను పంపాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌శర్మ, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష ఉపనేత గౌరవ్‌ గొగోయ్‌, రాజ్యసభ ఎంపీ సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌, లోక్‌సభ ఎంపీ రాజా బ్రార్‌ పేర్లను రాహుల్‌గాంధీ ప్రతిపాదించారు.

hju.jpg

కేంద్రం మాత్రం ఏకపక్షంగా శశిథరూర్‌ పేరును ప్రకటించింది. దీన్ని బట్టి, ముందుగానే పేర్లను నిర్ణయించుకుని, నామమాత్రంగా ఖర్గే, రాహుల్‌ను పేర్లివ్వాలని అడిగారని స్పష్టమవుతోంది’’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ మధ్యవర్తిత్వ ప్రకటనపై మోదీ మౌనం వీడడం లేదని ఎద్దేవా చేశారు.


ఆ ఏడుగురు ఎంపీలు వీరే..

ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమనే సందేశాన్ని ఐక్య రాజ్య సమితి(ఐరాస) భద్రతామండలిలోని సభ్య దేశాలతోపాటు.. ఇతర ప్రధాన భాగస్వామ్య దేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ఆరేడుగురు ఎంపీలతోపాటు.. సీనియర్‌ దౌత్యవేత్తలు, మాజీ రాయబారులుంటారు. ఈ బృందాలకు.. ఏడుగురు ఎంపీలు నేతృత్వం వహిస్తారు. వీరిలో నలుగురు అధికార ఎన్డీయే కూటమి, మరో ముగ్గురు విపక్ష ఇండియా కూటమి పార్టీల పార్లమెంట్‌ సభ్యులు. ఈ జాబితాలో శశిథరూర్‌(కాంగ్రెస్‌), రవిశంకర్‌ప్రసాద్‌(బీజేపీ), బైజయంత్‌ పాండా(బీజేపీ), సంజయ్‌కుమార్‌ ఝా(జేడీయూ), కనిమొళి(డీఎంకే), సుప్రియా సూలే(ఎన్‌సీపీ-శరద్‌పవార్‌), శ్రీకాంత్‌ శిందే(శివసేన) ఉన్నారు.

jh;.jpg

ఈ నెల 22 తర్వాత ఈ బృందాలు విదేశాలలో పర్యటించే అవకాశాలున్నాయి. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోవడం, పాక్‌పై భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాదంపై ఈ బృందాలు విదేశాలలో ప్రచారం చేస్తాయి.


పీవీ బాటలో మోదీ!

దౌత్య యుద్ధంపై మాజీ ప్రధాని పీవీ బాటనే ఇప్పుడు మోదీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 1994లో కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాకిస్థాన్‌ దుష్ప్రచారం చేసింది. జెనీవాలోని ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌లో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దాంతో పీవీ అప్పటి విపక్ష నేత వాజ్‌పేయి నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందాన్ని జెనీవాకు పంపించారు. ఆ బృందంలో అప్పటి జమ్మూకశ్మీర్‌ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా, సల్మాన్‌ ఖుర్షీద్‌, హామీద్‌ అన్సారీ ఉన్నారు. వీరి దౌత్య నీతితో పాక్‌ ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. 2008లో కూడా ముంబై ఉగ్రదాడుల్లో పాక్‌ ప్రమేయముందనే సందేశాన్ని ప్రపంచదేశాలకు అందించేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ బృందాలను పంపారు. ఇప్పుడు మోదీ కూడా.. పాక్‌ కుతంత్రాలపై ప్రపంచానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - 2025-05-18T05:54:27+05:30 IST