Share News

India Apache Helicopter Delivery: భారత్‌ అమ్ములపొదిలోకి 3 అపాచీ హెలికాప్టర్లు

ABN , Publish Date - Jul 23 , 2025 | 03:58 AM

అత్యంత శక్తివంతమైన అపాచీ ఎటాక్‌ హెలికాప్టర్లు భారత అమ్ములపొదిలో చేరాయి

India Apache Helicopter Delivery: భారత్‌ అమ్ములపొదిలోకి 3 అపాచీ హెలికాప్టర్లు
India Apache Helicopter Delivery

న్యూఢిల్లీ, జూలై 22: అత్యంత శక్తివంతమైన అపాచీ ఎటాక్‌ హెలికాప్టర్లు భారత అమ్ములపొదిలో చేరాయి. మూడు చాపర్లను అమెరికా ఏరోస్పేస్‌ దిగ్గజం బోయింగ్‌ మంగళవారం అందించిందని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. ఒప్పందంలో భాగంగా మొత్తం 6 ఏహెచ్‌-64ఈ అపాచీ చాపర్లను ఆ కంపెనీ అందించాల్సి ఉండగా తొలిదశలో మూడు చాపర్లు ఇచ్చిందని వెల్లడించారు. బహుముఖంగా వినియోగించే అత్యాధునిక ఏహెచ్‌-64ఈ యుద్ధ హెలికాప్టర్లు అమెరికా ఆర్మీలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటి రాకతో భారత ఆర్మీ సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని సోషల్‌ మీడియా పోస్టులో ఆర్మీ పేర్కొంది. మిగిలిన మూడు హెలికాప్టర్లు ఈ ఏడాది చివరకు వస్తాయని భావిస్తున్నారు. గతేడాది మార్చి 15న భారత ఆర్మీ తొలి అపాచీ యూనిట్‌ 451 ఆర్మీ ఏవియేషన్‌ స్క్వాడ్రన్‌ను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఏర్పాటు చేసింది. ఇప్పుడు వచ్చిన మూడు హెలికాప్టర్లను జోధ్‌పూర్‌లోనే మోహరించనున్నారని ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఆర్మీ అధికారులు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 03:59 AM