DRDO: ‘పినాక’ కోసం భారీ డీల్!
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:36 AM
భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) రూ.10 వేల కోట్ల విలువైన రాకెట్లు, మందుగుండు సామగ్రి కొనుగోలు కోసం అతిపెద్ద దేశీయ ఒప్పందానికి ఆమోదం తెలిపింది.

10 వేల కోట్ల ఒప్పందానికి సీసీఎస్ ఆమోదం
న్యూఢిల్లీ, జనవరి 30: భారత సైన్యం కోసం డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను మరింత విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) రూ.10 వేల కోట్ల విలువైన రాకెట్లు, మందుగుండు సామగ్రి కొనుగోలు కోసం అతిపెద్ద దేశీయ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. వీటి కొనుగోళ్లకు అవసరమైన అనుమతులు ఇచ్చామని సంబంధిత అధికారులు వెల్లడించారు. చైనాతో ఉత్తర సరిహద్దు వెంబడి భారత్ తన సైనిక శక్తిని బలోపేతం చేస్తున్న నేపథ్యంలో మరో ఆరు పినాక రెజిమెంట్ల కోసం.. మందుగుండు సామగ్రిని ఈ డీల్ ద్వారా సేకరించనున్నారు. భారత సైన్యం వద్ద ఇప్పటికే నాలుగు రెజిమెంట్ల పినాక రాకెట్ వ్యవస్థలు ఉన్నాయి.
ఈ ఒప్పందంలో భాగంగా స్వదేశీ కంపెనీల నుంచి పినాక రాకెట్లు, మందుగుండును కొనుగోలు చేయనున్నారు. కాగా, శత్రు స్థావరాలను, లక్ష్యాలను సెకన్ల వ్యవధిలో ధ్వంసం చేయగల సత్తా పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ (ఎంబీఆర్‌ఎల్) వ్యవస్థ సొంతం. సోవియెట్ కాలంనాటి గ్రాడ్ బీఎం-21 రాకెట్ లాంచర్ స్థానంలో పినాక ఎంబీఆర్‌ఎల్‌ను రూపొందించారు. కార్గిల్ యుద్ధంలో మొదటిసారిగా దీన్ని మోహరించారు. డీఆర్‌డీవోకు చెందిన ఆర్మమెంట్ రిసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ ఎస్టాబ్లి్‌షమెంట్ (ఏఆర్‌డీఈ) అభివృద్ధి చేసిన పినాకాలో 60 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే ప్రీ ఫ్లయిట్ ఆర్టిలరీ రాకెట్ ఉంది. 12 రాకెట్లను త్వరితగతిన ప్రయోగించగల మల్టీ ట్యూబ్ లాంచర్లు దీనిలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News