India Emerges as Millionaire Factory: భారత్ సంపన్నుల ఫ్యాక్టరీ
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:43 AM
మన దేశంలో సంపన్నుల సంఖ్య ఏటేటా భారీగా పెరుగుతోంది. మిలియనీర్లను తయారు చేసే ఫ్యాక్టరీగా భారత్ మారుతోంది. ఈ విషయం మెర్సిడెస్ బెంజ్ హురూన్ ఇండియా వెల్త్ రిపోర్టు- 2025 స్పష్టం చేసింది. దేశంలో...
దేశంలో పెరుగుతున్న మిలియనీర్లు
రూ.8.5 కోట్లకుపైగా ఆస్తి కలిగిన
కుటుంబాలు 8.71 లక్షలు
2021తో పోలిస్తే 90 శాతం పెరుగుదల
ముంబై, ఢిల్లీ, బెంగళూరుల్లోనే ఎక్కువ
బంగారం, షేర్లు, భూములపై పెట్టుబడులు
బెంజ్ హురూన్ ఇండియా వెల్త్ నివేదిక
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: మన దేశంలో సంపన్నుల సంఖ్య ఏటేటా భారీగా పెరుగుతోంది. మిలియనీర్లను తయారు చేసే ఫ్యాక్టరీగా భారత్ మారుతోంది. ఈ విషయం మెర్సిడెస్ బెంజ్ హురూన్ ఇండియా వెల్త్ రిపోర్టు- 2025 స్పష్టం చేసింది. దేశంలో లక్ష్మీ పుత్రులు విలాస వస్తువులను కొనుగోలు చేస్తున్నారని, పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారని, ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్నారని ఆ నివేదిక వివరించింది. ఆ నివేదిక ప్రకారం.. 8.5 కోట్లకు (1 మిలియన్ డాలర్లు)పైబడి ఆస్తి కలిగిన మిలియనీర్ల కుటుంబాలు ప్రస్తుతం దేశంలో 8.71 లక్షలు ఉన్నాయి. 2021తో పోలిస్తే ఆ సంఖ్య 90 శాతం పెరిగింది. అప్పట్లో మొత్తం దేశంలోని కుటుంబాల్లో ఈ మిలియనీర్ల కుటుంబాలు 0.17 శాతంగా (4,58,000) ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 0.31 శాతానికి (8,71,000) ఎగబాకింది. సంపన్నుల రాజధానిగా ముంబై తన ఖ్యాతిని నిలబెట్టుకుంది. మొత్తం మహారాష్ట్రలో 1.78 లక్షల కుటుంబాలు మిలియనీర్లు కాగా, ఒక్క ముంబైలోనే 1.42 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇక ఢిల్లీలో 79,800, తమిళనాడులో 72,600, కర్ణాటకలో 68,800, గుజరాత్‌లో 68,300 కుటుంబాలు భోగభాగ్యాలతో తులతూగుతున్నాయి. మిలియనీర్లు ఎక్కువగా ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లోనే మొత్తం 79 శాతం మంది ఈ ఐ శ్వర్యవంతులు నివసిస్తున్నారు. ఇక నగరాల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. అహ్మదాబాద్, హైదరాబాద్, పుణె వంటి నగరాలు కూడా వాటితో పోటీ పడుతున్నాయి. అయితే దేశంలో మిలియనీర్ల సంఖ్య జోరుగా పెరుగుతుండగా, బిలియనీర్ల సంఖ్య పెరుగుదల మాత్రం నత్తనడకన కొనసాగుతోంది. 2017-25 మధ్య మిలియనీర్ కుటుంబాలు 445ు పెరిగాయి. కానీ రూ.100 కోట్లు పైబడి సంప ద ఉన్న బిలియనీర్లు కేవలం 5ుమాత్రమే పెరిగారు. దేశంలో విస్తృతంగా సంపదపెరిగి మిలియనీర్ల సంఖ్య దూసుకెళుతున్నా బిలియనీర్ల క్లబ్ మాత్రం ప్రత్యేకతను కొనసాగిస్తోందని నివేదిక అభిప్రాయపడింది.
సంపన్నులు ఏం కొంటున్నారు..
150 మంది మిలియనీర్ల కుటుంబాలను పరిశీలించి వారి పెట్టుబడులు, కొనుగోళ్లపై మెర్సిడెజ్ బెంజ్ హురూన్ లగ్జరీ కన్సూమర్ సర్వే 2025 పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
వారి పెట్టుబడుల్లో స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, బంగారం తొలి స్థానాల్లో ఉన్నాయి.
ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్‌డీఎ్‌ఫసీ, అంతర్జాతీయ బ్యాంకుల్లో సిటీబ్యాంకుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
వాచ్‌ల్లో రోలెక్స్, బంగారం షాపుల్లో తనిష్క్, హోటళ్లలో తాజ్, వినియోగ వస్తువుల్లో గూచి, లూయి విట్టన్‌లకు ఓటేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి